ఇస్తే ఏమౌద్ది, అందులో డబ్బులు వేస్తారు, మనకే కదా లాభం అనుకుంటున్నారా? ఎట్టిపరిస్థితుల్లో ఇలా చేయొద్దు. తెలియని వ్యక్తులు ఎవరైనా మీ దగ్గరకొచ్చి మీ ఖాతాలో డబ్బులు వేస్తాం విత్ డ్రా చేసి ఇవ్వమని అడిగితే ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించొద్దు. అలా చేసి కర్నూలుకు చెందిన శ్రీనివాసరావు, హైదరాబాద్ కు చెందిన సాంబశివరావు ఇప్పుడు పోలీసు విచారణ ఎదుర్కొంటున్నాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. విశాఖకు చెందిన నరేంద్ర ఓ యాప్ నుంచి రుణం తీసుకున్నాడు. తిరిగి చెల్లించాడు కూడా. కానీ యాప్ మాత్రం వేధింపులు ఆపలేదు. ఒక దశలో నరేంద్ర భార్య ఫొటోల్ని మార్ఫింగ్ చేసి బంధువులందరికీ పంపించింది కూడా. దీంతో తట్టుకోలేక నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.
రంగంలోకి దిగిన పోలీసులు, సదరు యాప్ పై విచారణ చేపట్టారు. నిర్వహకులది చైనాగా గుర్తించారు. ఐపీ అడ్రెస్ లు మాత్రం పాకిస్థాన్, నేపాల్ చూపిస్తున్నాయి. అయితే డబ్బులు మాత్రం భారతీయ ఎకౌంట్లలో పడుతున్నాయి. దీంతో ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా కర్నూలుకు చెందిన శ్రీనివాసరావును ప్రశ్నించారు. ఎకౌంట్ ఇస్తే కమీషన్ ఇస్తామని సైబర్ నేరగాళ్లు ఆశజూపారని.. అందుకే తన ఎకౌంట్ తో పాటు, మరో 30 ఎకౌంట్లు ఇచ్చినట్టు అంగీకరించాడు శ్రీనివాసరావు. అందుకు ప్రతిఫలంగా 12 లక్షల రూపాయలు కమీషన్ గా తీసుకున్నాడు.
ప్రజల్ని వేధించి, పట్టి పీడించిన డబ్బును ఈ ఎకౌంట్లలోకి వేయించుకుంటున్న నేరగాళ్లు.. అట్నుంచి అటు ఆ డబ్బును క్రిప్టోగా మార్చి తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు.
అలా దేశవ్యాప్తంగా 132 బ్యాంక్ ఎకౌంట్లు గుర్తించారు పోలీసులు. ఈ ఎకౌంట్ల ద్వారా దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఇంకా చెప్పాలంటే, భారతీయ ఎకౌంట్లు వాడుకొని, ఎకౌంట్ హోల్డర్లకు కమీషన్ పేరిట చిల్లర ఇచ్చి, కోట్ల రూపాయల్ని క్రిప్టోగా మార్చుకొని దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు.
ఇలా ఎకౌంట్లు ఇచ్చిన అందరిపై చర్యలకు సిద్ధమౌతున్నారు పోలీసులు. వీటిలో ఎక్కువ ఎకౌంట్లు హైదరాబాద్ కు చెందిన సాంబశివరావు, అతడి అనుచరులకు చెందినవి ఉన్నాయి. ఈ ఎకౌంట్ల ద్వారా సాంబశివరావు, 4 కోట్ల రూపాయల కమీషన్ పొందినట్టు పోలీసులు గుర్తించారు.
Hello