ప‌వ‌న్ అడ్డా… జ‌న‌సేన‌లో ఎంపీపీ ఎన్నిక‌ ర‌చ్చ‌!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం యు.కొత్త‌ప‌ల్లి ఎంపీపీ ఎన్నిక‌ల తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం యు.కొత్త‌ప‌ల్లి ఎంపీపీ ఎన్నిక‌ల తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.

జ‌న‌సేన‌లో ఇద్ద‌రు మ‌త్స్య‌కార ఎంపీటీసీలు ఎంపీపీ ప‌ద‌వి ఆశిస్తున్నారు. అయితే ఎంపీటీసీ స‌భ్యుల బ‌లం ఉన్న వారిని కాకుండా, ఇంకొక‌రిని జ‌న‌సేన అధిష్టానం ఎంపిక చేయ‌డంతో గొడ‌వ‌కు దారి తీసింది.

ఎంపీపీ ప‌ద‌విని పొన్నాడ‌-1 , ఉప్పాడ‌-1 నుంచి గెలుపొందిన మ‌త్స్య‌కార సామాజిక వ‌ర్గానికి చెందిన ఎంపీటీసీ స‌భ్యులు వాడ్ర ధ‌న‌బాబు, గంట విజ‌య్‌కుమార్ ఆశిస్తున్నారు.

ఎంపీపీ ప‌ద‌వికి వీళ్లిద్ద‌రి మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కుంది. ఎంపీపీ సీటులో ఎవ‌రిని కూర్చోవాల‌నే విష‌య‌మై ఎమ్మెల్సీ నాగ‌బాబు, టీడ్కో చైర్మ‌న్ వేముల‌పాటి అజ‌య్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

కాకినాడ జ‌నసేన నాయ‌కులు మాత్రం గంట విజ‌య్‌కుమార్‌కు ఎంపీపీ ప‌ద‌వి ఇవ్వాల‌ని ప్ర‌తిపాదిస్తున్నారు. కానీ ఎంపీటీసీల్లో బ‌లం త‌న‌కే వుంద‌ని ధ‌న‌బాబు వాదిస్తున్నారు. దీంతో ఇరువ‌ర్గాల‌కు చెందిన వారు ఎంపీడీవో కార్యాల‌యానికి చేరుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీడీవో కార్యాల‌యంలో జ‌న‌సేన‌లోని రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. కాకినాడ ఎంపీ ఉద‌య్ వంశీ స‌మ‌క్షంలోనే సొంత పార్టీ ఎంపీటీసీ స‌భ్యుడిపై మ‌రో స‌భ్యుడు చేయి చేసుకున్నారు.

దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరువ‌ర్గాల‌ను స‌ర్దుబాటు చేశారు. అయితే ప్ర‌స్తుతానికి ఎంపీపీ ఎన్నిక వాయిదా వేసిన‌ట్టు తెలిసింది.