జనసేన నేతకు న్యాయం జరిగినట్లేనా?

ఎమ్మెల్యే టికెట్ ని ఆశించారు ఆయన. విశాఖ జిల్లాలో ఆ పార్టీని ఒంటి చేత్తో నడిపించారు. పెందుర్తి టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. తీరా ఎన్నికల వేళకు మాత్రం రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా…

ఎమ్మెల్యే టికెట్ ని ఆశించారు ఆయన. విశాఖ జిల్లాలో ఆ పార్టీని ఒంటి చేత్తో నడిపించారు. పెందుర్తి టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. తీరా ఎన్నికల వేళకు మాత్రం రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. దాంతో జనసేన కీలక నేత తమ్మిరెడ్డి శివశంకర్ కి టికెట్ దక్కలేదు. అలా ఆయన త్యాగ పురుషుడిగా మారిపోయారు.

కానీ పార్టీని అట్టిపెట్టుకొని అభ్యర్ధుల గెలుపునకు అంకిత భావంతో కృషి చేశారు. ఆయనకు ఇన్నాళ్ళకు న్యాయం జరిగింది అని అంటున్నారు. నామినేటెడ్ పోస్టుల పందేరంలో జనసేన కోటాలో విశాఖ నుంచి తమ్మిరెడ్డి శివశంకర్ కి ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి వరించింది.

అలా ఆయనకు ఒక అధికారిక హోదా దక్కిందని ఆయన అభిమానులు అనుచరులు సంబరపడుతున్నారు. అయితే ఈ పదవి ఓకే అయినా 2029 నాటికి అయినా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఉన్నతాధికారిగా పనిచేసి ఎంతో అనుభవం గడించిన ఆయన తన బలమైన వాణిని చట్ట సభలలో వినిపించాలని కోరుతున్నారు.

విశాఖ జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతలకు కూడా నామినేటెడ్ పదవులు దక్కాయి. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే టికెట్ కోసం చివరి దాకా ప్రయత్నం చేసిన పీలా గోవింద్ కి ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. చోడవరం టికెట్ ని ఆశించి భంగపడిన బత్తుల తాతయ్య బాబుకు ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవి దక్కింది.

ఇంకా చాలా మంది ఆశావహులు ఉన్నారు. మరోసారి పందేరంలో వీరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందో అని పార్టీలలో తర్కించుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు ఎమ్మెల్యే స్థాయి నేతలకు పూర్తి న్యాయం చేసినట్లేనా అంటే ఎంతో కొంత నయం అన్న మాటే వినిపిస్తోంది.

5 Replies to “జనసేన నేతకు న్యాయం జరిగినట్లేనా?”

Comments are closed.