ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో సుధాకర్ మిక్కిలినేని నిర్మించిన సినిమా దేవర. మరో మూడు రోజుల్లో ఈ సినిమా థియేటర్‌లోకి వస్తోంది. ఈ సినిమాకు చాలా స్పెషల్స్ వున్నాయి. సినిమాలో అధిక భాగం యాక్షన్ ఎపిసోడ్ లు సముద్రం మీదనే వుంటాయి. అందుకోసం సిజి పనులకు చాలా ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. సినిమా ప్రారంభిస్తూనే సిజి షాట్లు తీసేసి, మిగిలిన పనులు చేసుకున్నారు. దీని వల్ల అసలు వర్కింగ్ డేస్ కూడా చాలా అయ్యాయి. మామూలుగా నిర్మించే భారీ సినిమాలకు డబుల్ వర్కింగ్ డేస్ అయ్యాయి.
సినిమాలో పాన్ ఇండియా తారాగణం వుండడం, టెక్నికల్ కాస్టింగ్ కూడా భారీగా వుండడం వల్ల రెమ్యూనిరేషన్లు గట్టిగా అయ్యాయి. సిజి పనులకు, నిర్మాణానికి కూడా గట్టిగానే అయింది. అందువల్ల నిర్మాణ వ్యయం 400 కోట్ల వరకు అయిందని తెలుస్తోంది. హిందీ వెర్షన్ ను విడుదలకు ఇచ్చారు. మిగిలిన థియేటర్ హక్కుల రూపంలో 180 కోట్ల వరకు వచ్చింది. నాన్ థియేటర్ లో ఓటీటీ, అడియో, ఇతర మార్గాల ద్వారా 170 కోట్ల వరకు వచ్చింది. ఇంకా శాటిలైట్ కావాల్సి వుంది.
అంటే నాలుగు వందల కోట్లకు 350 కోట్ల వరకు రికవరీ వచ్చింది. శాటిలైట్ వుంది. దాంతో బ్రేక్ ఈవెన్ దగ్గరకు వెళ్తారు. హిందీ వెర్షన్ బాగా అడితే లాభాలు కళ్ల చూస్తారు. జాన్వి కపూర్ వుండడం, సైఫ్ అలీఖాన్ కీలకపాత్ర లో నటించడం, ఆర్.ఆర్.ఆర్ తరువాత ఎన్టీఆర్ నార్త్ బెల్ట్ లో కూడా పరిచయం కావడంతో మంచి కలెక్షన్లు వుంటాయని అశిస్తున్నారు.
సినిమా యూనివర్సల్ సబ్జెట్‌తో తయారవుతోంది. ఫుల్ యాక్షన్ సినిమా. అందువల్ల హిందీలో జనాలు కనెక్ట్ అయితే బాగానే వుంటుంది.
Good Luck Tarak …
vc estanu 9380537747
హిందీ వాళ్లు థియేటర్లో చూడరు
Call boy works 9989793850