జ‌న‌సేన కార్యాల‌యం చుట్టూ తిరిగితిరిగి అల‌సిపోయాం

మ‌హిళ‌ల‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ కురిపించే అభిమాన వ‌ర్షానికి వాళ్లంతా త‌డిసి ముద్ద‌య్యారు. తీరా అధికారంలోకి వ‌చ్చాక‌, కూట‌మి ప్ర‌భుత్వ నిజ స్వ‌రూపం ఏంటో క‌ళ్ల‌కు క‌డుతోంది.

కూట‌మి అధికారంలోకి వ‌స్తే, ప్ర‌తి ఆడ‌బిడ్డ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే బాధ్య‌త త‌న‌ది అని ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎన్నోసార్లు భ‌రోసా ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. మ‌హిళ‌ల‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ కురిపించే అభిమాన వ‌ర్షానికి వాళ్లంతా త‌డిసి ముద్ద‌య్యారు. తీరా అధికారంలోకి వ‌చ్చాక‌, కూట‌మి ప్ర‌భుత్వ నిజ స్వ‌రూపం ఏంటో క‌ళ్ల‌కు క‌డుతోంది.

మ‌రీ ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌ల‌కు, చేత‌ల‌కు అస‌లు పొంత‌నే వుండ‌ద‌ని క‌ర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి కేసే నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలిచింది. ఇటీవ‌లే ఆ కేసును తాము చేప‌ట్ట‌లేమంటూ సీబీఐ కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ త‌న‌కెంతో ప్ర‌తిష్టాత్మ‌క కేసుగా ఏళ్ల‌త‌ర‌బ‌డి చెబుతూ వ‌చ్చిన సుగాలి ప్రీతి హ‌త్యాచారం క‌థ కంచికి చేరిన‌ట్టే అనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా విజ‌య‌వాడ‌కు చెందిన ఓ త‌ల్లి త‌న కూతురితో క‌లిసి ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డుతున్నానంటూ విడుద‌ల చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. విజ‌య‌వాడ‌లోని వాంబే కాల‌నీకి చెందిన సుభాషిని, ఆమె కూతురు హాసిని ల‌క్ష్మి ఆత్మ‌హత్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. బాధిత త‌ల్లి ఆ వీడియోలో ఏమ‌న్నారంటే…

“జ‌న‌సేన‌, సీఎం చంద్రబాబు కార్యాల‌యాల చుట్టూ తిరిగితిరిగి అల‌సిపోయాం. డిప్యూటీ సీఎం పవన్ క‌ల్యాణ్ న్యాయం చేస్తార‌ని ఆశించినా ప్ర‌యోజ‌నం లేదు. ఏ న్యాయ‌మూ జ‌ర‌గలేదు. ఈ రోజు నా కూతురు చావ‌డానికి విషం తీసుకుంది. నా బిడ్డ‌తో పాటు నేనూ చ‌చ్చిపోతాను. ప‌బ్లిష‌ర్ చ‌క్ర‌వ‌ర్తి, నా భర్త శివ నాగరాజు, అత్తామామలు దుర్గ‌, వెంక‌టేశ్వ‌ర‌రావు, మరిది శివ‌కృష్ణ‌…ఈ ఐదుగురు మ‌మ్మ‌ల్ని మామూలుగా వేధించ‌లేదు. అద‌నంగా రూ.10 ల‌క్ష‌ల క‌ట్నం తీసుకొస్తేనే వుంటాన‌ని…ఈ రోజు కూడా నా పిల్ల‌ల్ని నా భ‌ర్త, అత్త‌మామ‌లు, మ‌రిది బెదిరించాడ‌ట‌. నాన్న రాడేమో అన్న బాధ‌తో నా బిడ్డ చావాల‌ని అనుకుంది. ఇప్పుడు మేమే వాళ్ల ఇంటిముందుకే వెళ్లి మేమే చ‌స్తాం. మా చావుల‌కు వాళ్ల ఐదుగురే కార‌ణం.

ఎన్ని పోలీస్‌స్టేష‌న్ల‌లో ఫిర్యాదు చేసినా, డ‌బ్బు తీసుకుని పోలీసులు వాళ్ల‌ని వ‌దిలేశారు. ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు కూడా నా స‌మ‌స్య తీర్చ‌లేక‌పోయారు. అందుకే మాకెవ‌రూ ఏమీ చేయ‌రు. మేమే చ‌స్తున్నాం. ద‌య‌చేసి మా చావుల‌క‌న్నా న్యాయం చేయండి. ద‌య‌చేసి ఇంకెప్పుడూ ఆడ‌వాళ్ల జీవితాల‌తో ఆడుకోవ‌ద్దు. ముఖ్యంగా రాజ‌కీయ నాయ‌కులు” అని ఆమె తీవ్ర ఆవేద‌న‌తో చెప్పుకొచ్చారు. క‌నీసం ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం మాన‌వ‌తా దృక్ప‌థంతో స్పందించాలి.

15 Replies to “జ‌న‌సేన కార్యాల‌యం చుట్టూ తిరిగితిరిగి అల‌సిపోయాం”

        1. Emito thalli chelli ni thu ani court lo case vesina party neetulu chebutaru

          Aina nee lanti neeli l k ki enka buddi rala

          Neeli kallatho ani neelam gane vuntai neeli l k .

          Malli vere party anatam Enduku

      1. Emito neeli lk lu chebutaru , papam hospital bills kosam ellu ammudam ante appointment evvani

        1 1 neeli l k party ye cheppali.

        Aina neeli l k akka , chelli ki dowry issue aithe police, court ki complaint evvali

        Thalli shelli thu anna mee bidda , supporters nee lage neelam l k

        Netizens talk ra lk

  1. మరి జగన్ రెడ్డి ఏమి చేస్తున్నాడు ? చిత్తుగా ఓడిపోయినా వాడు కనీసం ఇలాంటివి రోజుకి పది పరిష్కరిస్తేనే కదా ప్రతిపక్షహోదా ఈ సారియైన వచ్చేది ?

Comments are closed.