విశ్వంభర ఎప్పుడు?

మెగాస్టార్-యువి కాంబినేషన్ నిర్మాణమవుతున్న భారీ సినిమా విశ్వంభర. ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్నది క్వశ్చను మార్కుగా ఉంది.

మెగాస్టార్-యువి కాంబినేషన్ నిర్మాణమవుతున్న భారీ సినిమా విశ్వంభర. ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్నది క్వశ్చను మార్కుగా ఉంది. మే 9న విడుదల అని వార్తలు వినిపించాయి కానీ ఆ డేట్‌కు వచ్చే సూచనలు లేవు. జూన్ నెలలో వస్తుందని టాక్ ఉంది. కానీ ఇంకా అనౌన్స్‌మెంట్ రాలేదు. ఈ లోగా ఒక్కో సినిమా సమ్మర్ డేట్‌లు బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. జూన్ 20 డేట్‌ను శేఖర్ కమ్ముల-ధనుష్ సినిమాకు బ్లాక్ చేసారు.

అదే నెలలో ఇంకో మూడు డేట్‌లు ఉన్నాయి. కానీ మేకర్స్ ఎందుకో డేట్ ప్రకటించడం లేదు. షూట్ వర్క్ దాదాపు అయిపోయింది. పాటలు ఉన్నాయి. అవేమీ పెద్ద సమస్య కాదు. కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్‌తోనే సమస్య. అవి ఫుల్ క్వాలిటీతో రావాల్సి ఉంటుంది. అవి వచ్చి, వాటిని చూసి, ఒకె అనుకున్నాక కానీ డేట్ ఫిక్స్ చేయడం కష్టం. ఎందుకంటే అనుకున్న క్వాలిటీ రాకపోతే మళ్లీ చేయించాలి. ఎంత టైం పడుతుందో తెలియదు. అందుకే డేట్ వేయడం లేదని ఒక పాయింట్.

రెండో పాయింట్ ఏమిటంటే ఇప్పటివరకు విశ్వంభర నాన్-థియేటర్ అమ్మకాలు కాలేదు. ఆడియో రైట్స్ అమ్మారు. హిందీ రైట్స్ ఈ మధ్యనే బేరం సెటిల్ అయిందని వార్తలు ఉన్నాయి. కీలకమైన డిజిటల్ రైట్స్ బేరాలు తెగడం లేదు. డిజిటల్ అమ్మకాలు తెగకుండా విడుదల డేట్ వేయడం చాలా కష్టం. ప్రమాదం. రెండూ కూడా.

అందుకే విశ్వంభర సినిమా డేట్ క్లారిటీ రావాలంటే డిజిటల్ అమ్మకాలు జరిగి, వాళ్లు స్లాట్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఏ అప్డేట్ అయినా వస్తుంది.

5 Replies to “విశ్వంభర ఎప్పుడు?”

Comments are closed.