ఇదే సరైన సమయం.. నేనొస్తున్నా

సినిమా ఎప్పుడూ నా ఫస్ట్ ఛాయిస్. నా కమ్ బ్యాక్ కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి సిద్ధం.

90ల్లో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన హీరోయిన్ రంభ. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా హీరోలందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడీ మాజీ హీరోయిన్ ప్రస్తావన ఎందుకొచ్చింది? ఎందుకంటే, అలనాటి రంభ రీఎంట్రీ ఇస్తానంటోంది. తన రీఎంట్రీకి ఇదే సరైన సమయం అంటోంది.

“సినిమా ఎప్పుడూ నా ఫస్ట్ ఛాయిస్. నా కమ్ బ్యాక్ కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి సిద్ధం. నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రల కోసం చూస్తున్నాను. తద్వారా నాలోని కొత్త కోణం ఆవిష్కృతమవ్వడంతో పాటు, ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాను.”

ఇలా సినిమాల్లోకి మళ్లీ రావాలనుకుంటున్నానే సందేశాన్ని ఇండస్ట్రీకిచ్చింది రంభ. ఐటెంసాంగ్స్, సైడ్ రోల్స్ లాంటివి కాకుండా కాస్త మీనింగ్ ఉన్న పాత్రలు కోరుకుంటున్నట్టు చెప్పకనే చెప్పింది ఈ బ్యూటీ.

నిజానికి ఆమె ఇలా రీఎంట్రీ ప్రకటనలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. ఆల్రెడీ బుల్లితెరపైకొచ్చిన ఈ భామ, మంచి పాత్రలొస్తే టాలీవుడ్ లో నటిస్తానంటూ గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు మరోసారి అదే స్టేట్ మెంట్ రిపీట్ చేసింది. ఈసారైనా ఈమెపై టాలీవుడ్ దృష్టి పెడుతుందేమో చూడాలి.

రాజేంద్రప్రసాద్ నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో హీరోయిన్ గా మారిన రంభ, తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. పెళ్లి చేసుకున్న తర్వాత పరిశ్రమకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తానంటోంది. తెలుగులో ఆమె చేసిన ఆఖరి సినిమా దొంగ సచ్చినోళ్లు.

5 Replies to “ఇదే సరైన సమయం.. నేనొస్తున్నా”

  1. రంభ తొడలు స్తంభాలు అని అనుకునే వాళ్ళం ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ వయసులో అన్ని ఊడిగి పోతుంటాయి. ఏమీ సూత్తాం. ఏటి సేతాం.

Comments are closed.