పాపం.. పవన్ దర్శకులు

పవన్ లాంటి పవర్ స్టార్‌ను డైరక్ట్ చేస్తే ఇక కెరీర్ టర్న్ అవుతుంది అని భావిస్తారు. కానీ పాపం, పవన్‌తో చేసే దర్శకులు ఎవరూ సంతృప్తిగా లేరు.

పెద్ద హీరోతో చేస్తే తమ కెరీర్ బాగుంటుంది అనుకుంటారు దర్శకులు అంతా. పవన్ లాంటి పవర్ స్టార్‌ను డైరక్ట్ చేస్తే ఇక కెరీర్ టర్న్ అవుతుంది అని భావిస్తారు. కానీ పాపం, పవన్‌తో చేసే దర్శకులు ఎవరూ సంతృప్తిగా లేరు. భీమ్లా నాయక్ చేసిన దర్శకుడు సాగర్‌కు ఇప్పటి వరకు మళ్లీ మరో సినిమా చేతిలోకి రాలేదు. బ్రో సినిమా చేసిన సముద్రఖని మళ్లీ తెలుగు సినిమా ఏదీ టేకప్ చేయలేదు. సరే అయిపోయిన సినిమాల సంగతి అలా వుంచితే నిర్మాణంలో ఉన్న మూడు సినిమా దర్శకుల పరిస్థితి మరీ ఘోరం.

హరిహర వీరమల్లు అనే మంచి పీరియాడిక్ సినిమాను టేకప్ చేసారు దర్శకుడు క్రిష్. కానీ కొంత వరకు బండి లాగించాక ఇక లాగలేకపోయారు. పవన్‌కు కూడా ఆయన నప్పలేదు. స్క్రిప్ట్ మార్చించారు. సాంగ్స్ తగ్గించారు. ఇలా చాలా చేసారు అని టాక్. నిజానికి బ్రో సినిమాలో కూడా ఓ ఫైట్, పాట తీయించేసారు, అది వేరే సంగతి. మొత్తానికి క్రిష్ ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్లిపోయారు.

సుజిత్ దర్శకుడిగా ఓజి సినిమా ప్రారంభించారు. చాలా ప్రామిసింగ్‌గా కనిపించింది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీదే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. దర్శకుడు సుజిత్ ఈ సినిమా తరువాత నాని హీరోగా సినిమా చేయాల్సి వుంది. కానీ ఓజి పూర్తయి లేదు. సుజిత్‌కు ఫ్రీడమ్ రాదు. గత ఏడాది చివరిలో విడుదల అయిపోతుందనుకున్న సినిమా, ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతుంది అనుకున్న మూవీ ఇప్పటివరకు అలా వుంది. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు. పాపం, సుజిత్ ఈ పాటికి మరో సినిమా చేసి, ఎన్నో కోట్లు ఆదాయం సంపాదించే అవకాశం పోయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి వేరు. ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తెలివిగా మధ్యలో మరో సినిమా చేసేసుకున్నారు. ఉస్తాద్‌కు ఎప్పుడు డేట్‌లు ఇస్తే అప్పుడు చేసే మూడ్‌లో వుండిపోయారు. ఈ లోగా మళ్లీ మరో సినిమా చేయాలని ప్రయత్నం అయితే వుంది. ఆ విధంగా మిగిలిన దర్శకుల కంటే హరీష్ శంకర్ పని బెటర్‌గా వుంది.

మొత్తం మీద పవన్‌తో సినిమా అంటే ఇకపై దర్శకులు అంత స్పీడ్‌గా ముందుకు రారేమో?

19 Replies to “పాపం.. పవన్ దర్శకులు”

  1. సమంత మెగా హీరోలతో సినిమాలు చేసేది కాదు. త్రివిక్రమ్, సుకుమార్ లాంటి వాళ్లు అయితే తప్ప. ఆ మాఫియా లో పడితే ఫ్రీడమ్ ఉండదు. షూట్ కి రాకుండా, డైరెక్టర్స్ ని బ్లాక్ చేసి వాళ్ల జీవితాలు నాశనం చేసే వాడు, ఈ పిల్ల వె*వలకి లీడర్.

  2. సమంత మెగా హీరోలతో సినిమాలు చేసేది కాదు. త్రివిక్రమ్, సుకుమార్ లాంటి వాళ్లు అయితే తప్ప. ఆ మాఫియా లో పడితే ఫ్రీడమ్ ఉండదు. షూట్ కి రాకుండా, డైరెక్టర్స్ జీవితాలు నాశనం చేసే వాడు, లీడర్. మన ఖర్మ.

  3. రాసుకోడానికి ఏమి లేకపోతే వెనకటికి ఎవడో కింద గీసుకున్నాడట. అలా ఉంది మన పని

  4. పాపం జగన్ అనుచరులు..

    పాపం జగన్ నాయకులు..

    పాపం జగన్ కుటుంబీకులు..

    పాపం జగన్ అభిమానులు..

    లాంటి హెడ్లైన్స్ పెడుతూ రోజుకొక ఆర్టికల్ రాయొచ్చు..

    మీకు నిజంగా అభిమానం, ప్రేమ, జాలి, దయ, కరుణ లాంటి రసాలు ఉంటే .. మీ వాళ్ళని బాగు పరిచే ఆర్టికల్స్ రాయండి

  5. మీ అందరికీ ఒక్కటే చెపుతున్నా.. వైస్సార్సీపీ వాళ్లకి డైరెక్ట్ గ , ఇండైరెక్ట్ ఏ పనులు కూడా చేసే పరిస్థితి ఉండకూడదు.. బాబోరు..

    .

    సూపర్ సర్ మీరు… అలా ఉండాలి… అదే జగన్ చూడండి, కులం చూడం మతం చూడం అని అందరినీ సమానం గా చూస్తాం అని చెప్పి, చేస్తే, చాచి మొహాన కొట్టి, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించారు…

    .

    అందుకే మీరు సూపర్… ఇన్నాళ్లు రాజకీయాలు చేశారు..

    వీలైతే టాక్స్ లు కూడా.. ఒహ్హ్ సారీ, ఆల్రెడీ చేస్తున్నారు కదా.. అందుకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు టాక్స్ లు కట్టడం లేదు.. అందుకే రావాల్సిన gst , మైన్స్ మీద వచ్చే ఇన్కమ్, లిక్కర్ ఇన్కమ్ ఇంకా.. చాలా తగ్గిపోయాయి కదా.. సారీ, నేను మర్చిపోయా..

Comments are closed.