మంచి ప్ర‌భుత్వమ‌ని.. మీకు మీరే గొప్ప‌లా?

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వం గురించి తానే గొప్ప‌లు చెబుతున్నారు. త‌మ‌ది మంచి ప్ర‌భుత్వ‌మే కానీ, మెత‌క ప్ర‌భుత్వం కాద‌ని ఆయ‌న అన‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇటీవ‌ల పిఠాపురంలోనూ, ఇవాళ గుంటూరులో అట‌వీశాఖ…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వం గురించి తానే గొప్ప‌లు చెబుతున్నారు. త‌మ‌ది మంచి ప్ర‌భుత్వ‌మే కానీ, మెత‌క ప్ర‌భుత్వం కాద‌ని ఆయ‌న అన‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇటీవ‌ల పిఠాపురంలోనూ, ఇవాళ గుంటూరులో అట‌వీశాఖ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ స‌భ‌లోనూ ఇదే మాట అన్నారు.

కూట‌మిది మంచి ప్ర‌భుత్వ‌మ‌ని జ‌నాలు అంటే బాగుంటుంది. ఇత‌రుల నుంచి మంచి ప్ర‌భుత్వ‌మ‌నే అభినంద‌న వ‌స్తే, ఆ కిక్కే వేరు. అదేంటో గానీ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇత‌రుల‌కు ఆ అవ‌కాశం ఇవ్వ‌కుండా త‌మ ప్ర‌భుత్వాన్ని తానే పొగడ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. తాను భాగ‌స్వామి అయిన ప్ర‌భుత్వం ఎంత మంచిదో, ఇటీవ‌ల జ‌నం తిడ్తున్నార‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేసిన పవ‌నే స‌మాధానం చెప్పాల్సి వుంటుంది.

అన్నీ తానే మాట్లాడుతున్న విష‌యాన్ని ప‌వ‌న్ విస్మ‌రించిన‌ట్టున్నారు. ఇప్పుడు కొత్త‌గా మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ప‌వ‌న్ హెచ్చ‌రిస్తున్నారు. ఐపీఎస్ అధికారుల్ని వైఎస్ జ‌గ‌న్ బెదిరింపులు ఆప‌క‌పోతే సుమోటోగా తీసుకుని కేసులు పెడ‌తామ‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. మాట‌ల్లో కాకుండా, చేత‌ల్లో చూపితే బాగుంటుంది క‌దా. జ‌గ‌న్‌ను అరెస్ట్ చేసి, జైలుకు పంపితే ప్ర‌భుత్వానికి మ‌రింత మంచి పేరు వ‌చ్చే అవ‌కాశం వుంటుంద‌ని నెటిజ‌న్లు సెటైర్స్ విస‌రుతున్నారు. మంచి ప‌నికి ఆలస్యం దేనికి ప‌వ‌న్‌, వెంట‌నే జ‌గ‌న్‌ను జైల్లో వేస్తే, ఇక మాట్లాడే గ‌ళం కూడా వుంద‌డు మ‌రి!

10 Replies to “మంచి ప్ర‌భుత్వమ‌ని.. మీకు మీరే గొప్ప‌లా?”

  1. మా నమ్మకం నువ్వేయ్ జగన్ అని స్టికర్ అంటించినప్పుడు చెప్పాల్సింది ఈ కధలు

  2. మన అన్న మాత్రం తక్కువ సౌమ్యుడు, నీతిమంతుడు అంటూ ఒక్కక్కడిని బాగా ఎత్తాడు కదా

  3. ఇతనికి ఓట్లు వేసేవాళ్ళ సంగతి పక్కన పెడితే ఇతను రాకూడదు వేరే ఎవరు వచ్చిన పర్వాలేదనే వర్గం 35 %పైన వున్నారు వాళ్ళు ఇతన్ని ఓడించటానికి ఏ పార్టీ అభ్యర్థి అయితే ఇతని అభ్యర్థిని ఓడించగలడో వాళ్ళకే వేస్తారు వైస్సార్ సానుభూతి మొన్నటి 2019 ఎలేచ్షన్స్ తో పోయింది 2024 లో సర్ ప్రతిభ 11 దగ్గర ఆగిపోయింది గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చెయ్యాలంటే 10000 వోల్ట్ కరెంటు తీగను పట్టుకొన్నంత బయపడుతున్నాడు

  4. ఒరే గే ఇప్పుడు నువ్వు నీ జగనూ నే చెప్పాలి మంచి ప్రభుత్వం అని. కూసింత కూడా సిగ్గు లజ్జ మానం అభిమానం లేకుండా ఏమిటీ ఈ పిచ్చి రాతలు. ఇప్పుడు ఏ జనం ప్రభుత్వం మంచిది కాదన్నారు? నిండా మూడు రోజులు కాకుండానే మొదలెట్టేస్తిరి రాష్ట్రపతి పాలనా గాడిద గుడ్డు అని. అసలు జనం ఎట్టా నమ్మేది?

  5. ఇది మంచి ప్రభుత్వం కాదు అనిపిస్తే 11.11 11am కి అసెంబ్లీ లో 11-నోడు నిలదీయొచ్చు కదా..

Comments are closed.