ఈ భరోసా చాల‌దు జ‌గ‌న్‌!

వైసీపీకి ఇది క‌ష్ట‌కాలం. అయితే క‌ష్ట‌న‌ష్టాలు శాశ్వతంగా వుండ‌వ‌నే సంగ‌తి తెలుసు. కానీ క‌ష్ట‌కాలంలో గ‌ట్టి నిల‌బ‌డిన వాళ్ల‌కే భ‌విష్య‌త్ వుంటుంది. ఊరికే ఎవరికీ ఏదీ రాదు. కాలం అనేది ప‌రీక్ష పెడుతూ వుంటుంది.…

వైసీపీకి ఇది క‌ష్ట‌కాలం. అయితే క‌ష్ట‌న‌ష్టాలు శాశ్వతంగా వుండ‌వ‌నే సంగ‌తి తెలుసు. కానీ క‌ష్ట‌కాలంలో గ‌ట్టి నిల‌బ‌డిన వాళ్ల‌కే భ‌విష్య‌త్ వుంటుంది. ఊరికే ఎవరికీ ఏదీ రాదు. కాలం అనేది ప‌రీక్ష పెడుతూ వుంటుంది. ఆ ప‌రీక్ష‌లో నెగ్గితే, ముందుకు పోతారు. లేదంటే అక్క‌డితో ఆగిపోతారు. బ‌హుశా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలా కాలం పెట్టిన ప‌రీక్ష‌లు మ‌రెవ‌రికీ ఎదురై వుండ‌వేమో. అందుకే ఆయ‌న దేన్నైనా చాలా ఈజీగా తీసుకుంటుంటారు.

అంద‌రూ జ‌గ‌న్‌లా వుండ‌లేరు. వుండాల‌ని కోరుకోవ‌డం త‌ప్ప‌వుతుంది. వైసీపీ త‌ర‌పున గ‌ళం విప్పితే చాలు… కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు. వైసీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్తను అరెస్ట్ చేయ‌కుండా, కేవ‌లం నోటీసుతో స‌రిపెట్టార‌నే కార‌ణం ఏకంగా క‌డ‌ప ఎస్పీ బ‌దిలీకి దారి తీసింది. త‌ద్వారా వైసీపీపై ఉక్కుపాదం మోపాల‌నే సంకేతాల్ని రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగానికి ప్ర‌భుత్వం ఇవ్వాల‌ని అనుకుంది.

ఇదే స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వ్యూహ‌త్మ‌కంగా అడుగులు ముందుకేశారు. మీడియా స‌మావేశంలో పోలీసుల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్ల‌కాలం ఇదే ప్ర‌భుత్వం వుండ‌ద‌ని, పోలీస్ అధికారులు అత్యుత్సాహంతో త‌మ వాళ్ల‌ను కేసుల పేరుతో వేధిస్తే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని హెచ్చ‌రించారు. స‌ప్త స‌ముద్రాల ఆవ‌త‌ల ఉన్న‌, తీసుకొస్తామ‌ని, అలాగే రిటైర్ అయితే ఏమీ చేయ‌లేర‌ని అనుకుంటే పొర‌పాటే అని గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చారు. జ‌గ‌న్ ప్రెస్‌మీట్ పెట్టి, మ‌రీ వార్నింగ్ ఇవ్వ‌డంతో వైసీపీ శ్రేణుల్లో భ‌రోసా నింప‌డంతో పాటు ఏం చేసినా ఏమీ కాద‌ని అనుకునే పోలీస్ అధికారులు పున‌రాలోచ‌న‌లో ప‌డే అవ‌కాశం వుంది.

అయితే ఈ భ‌రోసా వైసీపీ శ్రేణుల‌కు చాల‌దు. జ‌గ‌న్ చెప్పిన‌ట్టు, ఇటీవ‌ల కాలంలో చ‌ట్ట వ్య‌తిరేకంగా అరెస్ట్ చేసిన పోలీసు అధికారుల‌పై వైసీపీ త‌ర‌పున ప్రైవేట్ కేసులు వేయాలి. ఈ విష‌యంలో జ‌గ‌న్‌, వైసీపీ లీగ‌ల్ టీమ్ కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం కాకూడ‌దు. అన్యాయంగా అరెస్ట్ చేసే పోలీస్ యంత్రాంగంపై ప్రైవేట్ కేసులు వేసి, కోర్టుకు లాగితే పోలీస్ యంత్రాంగం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డే అవ‌కాశం వుంది. క‌నీసం అప్పుడైనా చ‌ట్ట ప్ర‌కారం న‌డుచుకునే అవ‌కాశం వుంటుంది.

అలాగే పోలీస్, కూట‌మి నేత‌ల వేధింపుల‌కు గుర‌వుతున్న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు ఆర్థికంగా భ‌రోసా ఇవ్వాలి. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎలాంటి ల‌బ్ధి పొంద‌క‌పోగా, ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలోనూ క‌ష్ట‌న‌ష్టాల‌ను భ‌రించే శ‌క్తి వాళ్ల‌కు ఉండ‌దు. కావున వైసీపీ, జ‌గ‌న్‌ను న‌మ్ముకున్న వాళ్లు రోడ్డున ప‌డ‌క ముందే ఆర్థిక భ‌రోసా ఇవ్వాల్సిన బాధ్య‌త‌, అవ‌స‌రం జ‌గ‌న్‌పై వుంది. దీన్ని వైఎస్ జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీసుకోవాలి.

ఇప్ప‌టికైనా జ‌గ‌న్ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతుండ‌డం వైసీపీ శ్రేణుల‌కు సంతోషాన్ని ఇస్తోంది. అయితే జ‌గ‌న్‌లో ఇంకా మార్పు కోరుకుంటున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు శ్రేణుల‌కు అండ‌గా నిలిస్తేనే, పార్టీకి, త‌న‌కు భ‌విష్య‌త్ వుంటుంద‌ని జ‌గ‌న్ గుర్తించి, ఆ మేర‌కు ముందడుగు వేయాల్సిన అవ‌స‌రం వుంది.

24 Replies to “ఈ భరోసా చాల‌దు జ‌గ‌న్‌!”

  1. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు అని జ్ఞానం ఉన్నవాడు.. తాను అధికారం లో ఉన్నప్పుడు.. నా వెంట్రుక కూడా పీకలేరు అని ఎందుకు విర్రవీగినట్టు..

    ఇప్పుడు.. నా బొచ్చు అంతా పీకేస్తున్నారు మొర్రో అని ఏడవడము ఎందుకు..?

    ఇరగదెంగుతున్నారు.. బాబోయ్.. అని మొత్తుకోవడం ఎందుకు..?

    అధికారం లో ఉన్నప్పుడు చెలరేగిపోవడం.. అధికారం పోగానే.. ఉడత ఊపులు ఊపడం.. సింగల్ సింహం అవలక్షణాలా..?

  2. బాబూ..పవన్ గారు..అలా మీడియా ముందుకొచ్చి తమరి (ప్రభుత్వ ) ఆదేశాలకు వ్యతిరేకంగా భూముల లెక్కలు చెప్పి సరస్వతికి క్లీన్ చీట్ ఇచ్చిన సదరు రెవిన్యూ యంత్రంగా,వీలైతే సదరు మంత్రిగారిపై పోలీస్ కేసులు,ఇతర చర్యలు తీసుకోవాలి…

    1. ఫేక్టరీ కట్ట కుండా కిందన ఉన్న సున్నపు రాయి కోసం చేసిన తతంగం అది . సిఎం స్వయాన తన భూముల లీజు లు ను 50 ఎయల్లకు పెంచుకోవడం ఏంట్రా ? పదవి అద్దం పెట్టుకొని ఎన్ని లాభాలు పొందాడు

    2. సిన్నపు రాల్ తవకలకు 30 ఎలా లీజు లను 50 ఎలకు పెంచుకోవడం ఏమంటారు

    3. ప్రతి వోలంటేరు ప్రతి సచివాలయం రెండు సాక్షి పేపర్ లను కొనడం ఏ స్కీం కిందకు వస్తుంది

  3. Phone tapping ప్రభాకర రావు green card తో సప్త సముద్రాల అవతలి ఉన్నాడు. పోయి తీసుకురావొచ్చుగా..!

  4. Phonne tappingg ప్రభాకర రావు greenn cardd తో సప్త సముద్రాల అవతలి ఉన్నాడు. పోయి తీసుకురావొచ్చుగా..!

  5. అత్యంత బాధాకరమైన నీచ మయిన కామెంట్ లు పెట్టు కొనే వర్ర రవీంద్ర మీకు సోషల్ మీడియా యోధుడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళు చక గానే ఉన్నారు .జైల్ లో పెట్టాల్సింది un మాధులను

  6. ఇంట్లో అదొల్లను నో టీ కి వచ్చిన కామెంట్ లు పెట్టే వర్ర రవీందర్ గా డు ఒక మనీషా

  7. వ ర రవి ందర్. ట్విట్టర్ కామెంట్ లు ఎవరయినా పెట్టండి . వీడికి

  8. వ. ర. రవిద్భర్ అంటే ఒక ఉన్నత మయిన వ్యక్తి అతన్ని ఇలా అనడం ఎంది

  9. ఈ ఒక్క పోరంబోకు గాడిని యెల్ల కాలం పదవి రాకుండా చూసుకుంటే తప్ప, రాష్ట్రం బాగుపడదు.

  10. నువ్వు వన్ టైం వండర్ రా జగనా…

    ఒక్క చాన్స్ అని అడుక్కున్నావ్, నీ త ల్లి చె ల్లి, పె ళ్ళాం చేత అడిగించావ్.

    ఆ ఇచ్చిన ఒక చాన్స్ కే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావ్.

    నీలాంటివాడికి మళ్ళీ అవకాశం ఎలా ఇస్తారురా సై కో!

Comments are closed.