
చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన వాళ్లు స్పందించారు. స్పందిస్తారని ఎదురుచూసిన వాళ్లు స్పందించలేదు. వాళ్లలో ముఖ్యుడు ఎన్టీఆర్. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే, ఆ అరెస్ట్ ను ఎన్టీఆర్ ఖండిస్తాడని టీడీపీ నేతలు ఎదురుచూశారు. కానీ తారక్ లైట్ తీసుకున్నాడు. ఆ టైమ్ లో ఫారిన్ వెళ్లాడు, తిరిగొచ్చి సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు.
తారక్ స్పందిస్తే, ఆ కామెంట్స్ తో రాజకీయ లబ్ది పొందాలని చూశారు టీడీపీ నేతలు. కానీ వాళ్ల పప్పులుడకలేదు. అతడిక స్పందించడని తేలిపోయింది. టీడీపీ నేతలకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడీ అంశంపై స్వయంగా బాలకృష్ణ స్పందించాడు.
"ఎవరు ఖండించకపోయినా పట్టించుకోను. ఇది సినిమా రంగానికి సంబంధించినది కాదని అనడం తప్పే. వాళ్లు కూడా పౌరులే కదా. వాళ్ల సినిమాల్ని జనం చూడాల్సిందే. వాళ్లను నా సెక్షన్ నుంచి తీసేశాను. వాళ్లు ఖండించకపోతే ఐ డోంట్ కేర్. నా నెక్ట్స్ సినిమాలో డైలాగ్ ఇది. బయట కూడా నా డైలాగ్ కూడా ఇదే."
ఇలా ఎన్టీఆర్ స్పందించకపోవడాన్ని లైట్ తీసుకున్నారు బాలకృష్ణ. కొన్ని రోజుల కిందట ఇదే అంశంపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు. తాము సినిమా వాళ్లమని, చంద్రబాబు అరెస్ట్ పై స్పందించమని అడగడం కరెక్ట్ కాదని పెద్ద లెక్చర్ ఇచ్చారు. సినిమా జనాలెవ్వరూ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించాల్సిన అవసరం లేదనే విధంగా మాట్లాడారు.
ఈ అంశాన్ని కూడా పరోక్షంగా ప్రస్తావిస్తూ, పైవిధంగా కామెంట్ చేశారు బాలకృష్ణ. వాళ్లను తన సెక్షన్ నుంచి తీసేస్తానని అన్నారు. బాలయ్య తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాలో "బ్రో.. ఐ డోంట్ కేర్" అనే డైలాగ్ ఉంది. తాజాగా ఆ డైలాగ్ రిలీజైంది కూడా. నిజజీవితంలో కూడా తనది అదే డైలాగ్ అన్నారు బాలయ్య.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా