Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

చిరంజీవి ఇలా కూడా ప‌రువు తీసుకుంటున్నారా!

చిరంజీవి ఇలా కూడా ప‌రువు తీసుకుంటున్నారా!

రాజ‌కీయ పార్టీని పెట్టారు.. సీఎం కావాల‌నే క‌ల‌ల‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.. దానికి ప్ర‌జాసేవ అని పేరు పెట్టారు! ప్ర‌జారాజ్యం తెస్తాన‌న్నారు! క‌ట్ చేస్తే.. అనుకున్న అధికారం అంద‌క‌పోవ‌డంతో.. ఇక మ‌రో మార్గం లేక విలీనం చేసి ప‌ద‌వి పొంది ప‌రువు పోగొట్టుకున్నారు! చిరంజీవికి అప్పుడు ద‌క్కిన కేంద్ర‌మంత్రి ప‌దవి ఆయ‌న‌కు అద‌న‌పు ఆభ‌ర‌ణం కాక‌పోగా.. అదో ప‌రువు త‌క్కువ అధ్యాయానికి తార్కాణంగా ఉంటుంది.

ఆ ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత చిరంజీవికి రాజ‌కీయం అంటే వైరాగ్యం వ‌చ్చింది. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్న‌ట్టుగా ప్ర‌క‌ట‌న ఏదీ చేయ‌కుండానే త‌ప్పుకున్నారు! సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అక్క‌డ కుర్ర హీరోయిన్ల‌తో గంతులు వేసుకుంటూ ఉన్నారు. 

లాహే లాహే అనుకుంటూ అదేదో చేసుకోకుండా.. ఇప్పుడు ఉన్న‌ట్టుండి చిరంజీవి ఇలా వాళ్ల‌ను గెలిపించండి, వీళ్ల‌ను గెలిపించండి అంటూ వీడియోలు చేయ‌డం కామెడీగా మారుతోంది. ఆయ‌నే స్వ‌యంగా అడిగితే, ఆయ‌న‌ను ఆయ‌న పార్టీని ప్ర‌జ‌లు గెలిపించ‌లేదు! ఇప్పుడు అందునా.. సీఎం ర‌మేశ్ ను గెలిపించాలంటూ చిరంజీవి పిలుపును ఇవ్వ‌డం ప్ర‌హ‌స‌నం!

చిరంజీవి ఈ పిలుపును ఇవ్వ‌డం వెనుక కార‌ణాలు ఏమున్నా.. ఇది గ‌తంలో చిరంజీవి ఇచ్చిన పిలుపును గుర్తు చేస్తోంది. 2004లో చిరంజీవి ఒక ఎంపీ క్యాండిడేట్ ను గెలిపించ‌మంటూ పిలుపునిచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన అశ్వినీద‌త్ ను గెలిపించాలంటూ చిరంజీవి పిలుపునిచ్చారు!

ద‌త్తును గెలిపించండి అంటూ టీవీ చాన‌ళ్ల ద్వారా చిరంజీవి ప్ర‌చారం చేశారు! క‌ట్ చేస్తే.. ఆ ఎన్నిక‌ల్లో అశ్వినీద‌త్ ఓట‌మి పాల‌య్యారు! ఇప్పుడు చిరంజీవి మ‌ళ్లీ అలాంటి గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇస్తున్నారు! దీంతో పాత రాజ‌కీయాలు గుర్తు చేసుకోవాల్సి వ‌స్తోంది. అయినా.. రాజ‌కీయాలు త‌న మ‌న‌స్త‌త్వానికి ప‌డ‌వంటూ..విలీనానికి కూడా ఒక క‌వ‌రింగ్ ఇచ్చారు క‌దా, మ‌ళ్లీ ఈ గెస్ట్ అప్పీరియ‌న్స్ లు ఎందుక‌బ్బా!  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?