Advertisement

Advertisement


Home > Politics - Andhra

ముస్లిం రిజ‌ర్వేష‌న్లను వ్య‌తిరేకించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

ముస్లిం రిజ‌ర్వేష‌న్లను వ్య‌తిరేకించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

ముస్లింల రిజ‌ర్వేష‌న్ల‌ను ఇంత కాలం బీజేపీ ఒక్క‌టే వ్య‌తిరేకిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీకి మ‌రో పార్టీ అధినేత తోడ‌య్యారు. ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌ను వ్య‌తిరేకిస్తున్న ఆ నాయ‌కుడే జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. ముస్లింల విష‌యంలో చంద్ర‌బాబునాయుడిలా మ‌న‌సులో ఒక‌టి, బ‌య‌టికి మ‌రోలా మాట్లాడ్డం త‌మ నాయ‌కుడు ప‌వ‌న్‌కు చేత‌కాద‌ని జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు.

ఎన్నిక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఒక ఇంగ్లీష్ చాన‌ల్ ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ సంద‌ర్భంగా ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం, ఆ పార్టీ ముస్లింల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని చెబుతున్న నేప‌థ్యంలో, రాజ‌కీయంగా న‌ష్టం వ‌స్తుంద‌ని మీరేమైనా నిరాశ‌, ఆందోళ‌న చెందుతున్నారా? అని ప‌వ‌న్‌ను అమాయ‌కంగా మీడియా ప్ర‌తినిధి ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ చాలా సూటిగా, స్పష్టంగా ... అబ్బే, అలాంటిదేమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ముస్లింల రిజ‌ర్వేష‌న్లను ర‌ద్దు చేస్తామ‌ని బీజేపీ ప్ర‌క‌టించ‌డంపై తానేమీ నిరాశ‌, ఆందోళ‌న చెంద‌డం లేద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు చెప్పారు. ముస్లింల రిజ‌ర్వేష‌న్ల అమ‌లు కంటే, యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు, నైపుణ్యాలు పెంచేలా శిక్ష‌ణ ఇప్పించాల‌ని ఆయ‌న కోర‌డం గ‌మ‌నార్హం. ఇదే సంద‌ర్భంలో త‌న సామాజిక వ‌ర్గానికి కూడా రిజ‌ర్వేష‌న్లు వ‌ద్ద‌ని ప‌రోక్షంగా ప‌వ‌న్ చెప్పడం గ‌మ‌నార్హం.  

ఇదిలా వుండ‌గా ప‌వ‌న్ కామెంట్స్‌పై టీడీపీ మండిప‌డుతోంది. ఎన్నిక‌ల వేళ వివాదాస్ప‌ద అంశాల‌పై ప‌వ‌న్ అమాయ‌కంగా మాట్లాడ్డం తీవ్రంగా న‌ష్టం తెస్తుంద‌ని టీడీపీ ఆందోళ‌న చెందుతోంది. ఎప్పుడు ఎలా మాట్లాడాలో ప‌వ‌న్‌కు తెలియ‌ద‌ని, మ‌రోవైపు ముస్లింల రిజ‌ర్వేష‌న్ల కోసం ఎందాకైనా పోరాడుతాన‌ని సీఎం జ‌గ‌న్ చెబుతుండ‌డాన్ని టీడీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. ప‌వ‌న్ తాజా  కామెంట్స్‌తో కూట‌మికి దారుణ‌మైన దెబ్బ ప‌డ‌నుంద‌ని క‌ల‌వ‌రం మొద‌లైంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?