Advertisement

Advertisement


Home > Politics - Andhra

కూట‌మి కుట్ర‌ల‌కు ఈసీ ద‌న్ను.. హైకోర్టు బ్రేక్‌!

కూట‌మి కుట్ర‌ల‌కు ఈసీ ద‌న్ను.. హైకోర్టు బ్రేక్‌!

ప‌లు ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌కు నిధులు అంద‌కుండా ఈసీ ద్వారా కూట‌మి కుట్ర‌ల‌కు తెర‌లేపగా, వాటికి ఏపీ హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు భారీ మొత్తంలో ల‌బ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జ‌మ కానుండ‌డంతో కూట‌మి నేత‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌కు చెందిన ల‌బ్ధిదారుల‌కు రూ.14,165 కోట్లు అంద‌నుంది.

రైతుల‌కు ఇన్‌ఫుట్ స‌బ్సిడీ, విద్యా దీవెన‌, మ‌హిళ‌ల‌కు ఆస‌రా, చేయూత‌, ఈబీసీ ల‌బ్ధిదారుల‌కు ఎన్నిక‌ల కోడ్ రావ‌డానికే ముందు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ‌ట‌న్ నొక్కారు. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వ ఖ‌జానాలో నిధుల ల‌భ్య‌త బ‌ట్టి... ల‌బ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జ‌మ కావ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పైన పేర్కొన్న ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌కు నిధులు జ‌మ చేయ‌వ‌ద్ద‌ని ఎన్నిక‌ల సంఘం ద్వారా కూట‌మి నేత‌లు కుట్ర‌ల‌కు తెర‌లేపారు.

ఎన్నిక‌ల సంఘం కూడా కూట‌మి ఫిర్యాదుకు త‌లొగ్గి, ప‌థ‌కాల ల‌బ్ధిదారుల నిధుల జ‌మ‌కు బ్రేక్ వేసింది. దీంతో ప‌థ‌కాల ల‌బ్ధిదారులు ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. హైకోర్టులో తీవ్ర వాదోప‌వాదాలు జ‌రిగాయి. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంలో ప‌సుపు కుంకుమ కింద ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా రెండు రోజుల ముందు రూ.10 వేలు చొప్పున ల‌బ్ధిదారుల ఖాతాలో జ‌మ అయిన విష‌యాన్ని గుర్తు చేశారు.

ఎన్నిక‌ల సంఘం ఒక్కోసారి ఒక్కో ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఈ ప‌థ‌కాలు, ల‌బ్ధిదారులు కొత్త‌వి కాద‌ని, గ‌త ఐదేళ్లుగా కొన‌సాగుతున్న‌వే అని ల‌బ్ధిదారుల త‌ర‌పు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేప‌థ్యంలో గ‌త రాత్రి 10.20 గంట‌ల స‌మ‌యంలో జ‌స్టిస్ బొప్పూడి కృష్ణ‌మోహ‌న్ కీల‌క తీర్పు వెలువ‌రిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చారు.

నిధుల విడుద‌ల‌పై ఈసీ ఇచ్చిన ఆదేశాల‌ను ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు తాత్కాలికంగా నిలిపి వేసింది. దీంతో ఇన్‌ఫుట్ స‌బ్సిడీ, విద్యా దీవెన‌, మ‌హిళ‌ల‌కు ఆస‌రా, చేయూత‌, ఈబీసీ నేస్తం కింద రూ.14,165 కోట్ల నిధుల‌ను ల‌బ్ధిదారుల ఖాతాల్లో వేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఊర‌ట ల‌భించిన‌ట్టైంది. అయితే నిధుల విడుద‌ల‌పై ఎలాంటి ప్ర‌చారం చేసుకోవ‌ద్ద‌ని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వ‌ర‌కూ సంక్షేమ ప‌థ‌కాల నిధుల పంపిణీ లేదా బ‌ద‌లాయింపు చేయ‌వ‌ద్ద‌ని ఈసీ ఆదేశాలు అమ‌లవుతాయ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. 

తాజాగా కోర్టు ఆదేశాలు కూట‌మి నేత‌ల‌కు గ‌ట్టి షాక్‌గా చెప్పొచ్చు. వేల కోట్ల రూపాయ‌లు ఎన్నిక‌ల‌కు 48 గంట‌ల ముందు ల‌బ్ధిదారుల ఖాతాలో ప‌డ‌డంతో ఆందోళ‌న మొద‌లైంది. ఇది ఖ‌చ్చితంగా ఎన్నిక‌ల్లో తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని కూట‌మి నేత‌లు భ‌య‌ప‌డుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?