ఆ ఎమ్మెల్యే మీద బాబు ప్రేమ

చంద్రబాబు ఈసారి మాత్రం వాస్తవాలకు తగినట్లుగానే ఆలోచిస్తున్నారు. చెప్పిన మాటకు తగినట్లుగానే ఆయన వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. పనిచేసే వారికే పెద్ద పీట అని చెప్పిన బాబు అలాంటి నేతలనే ప్రోత్సహిస్తున్నారు. విశాఖ జిల్లాలో…

చంద్రబాబు ఈసారి మాత్రం వాస్తవాలకు తగినట్లుగానే ఆలోచిస్తున్నారు. చెప్పిన మాటకు తగినట్లుగానే ఆయన వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. పనిచేసే వారికే పెద్ద పీట అని చెప్పిన బాబు అలాంటి నేతలనే ప్రోత్సహిస్తున్నారు. విశాఖ జిల్లాలో వెనకబడిపోయిన కొందరు నేతలను ముందు వరసలోకి బాబు తీసుకుని వస్తున్నారు.

వారినే సమర్ధించాలని బాబు నిర్ణయించుకున్నట్లుగా అనిపిస్తోంది. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబును ఇటీవల జిల్లా టూర్ లో అందరి ముందు ఎంతగానో ప్రశంసించిన చంద్రబాబు అలాంటి వారే తనకు కావాలని పార్టీకి ఒక సందేశం ఇచ్చారు.

విశాఖ టీడీపీలో తిరుగులేని నాయకుడు అని గణబాబుకు కితాబు ఇచ్చారు. గణబాబు ఇంట ఈ నెల 31న జరిగే శుభకార్యానికి ప్రత్యేకంగా పని గట్టుకుని మరీ బాబు వస్తున్నారు అంటే ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యత అర్ధమవుతోంది అని అంటున్నారు.

విశాఖలో మాజీ మంత్రులు ఉద్ధండులు అయిన నేతలు ఎంతో మంది ఉన్నారు. గణబాబు విషయానికి వస్తే ఆయన మూడు సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే. బలమైన సామాజికవర్గానికి చెందిన నేత. ఆయనకు 2014 నుంచి 2019 మధ్యలో మంత్రి పదవి వస్తుందని అనుకున్నా దక్కలేదు. అయినా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నారు.

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో పాలు నీళ్ళు ఏమిటో పార్టీలోని కొందరు నాయకుల తీరు మీద బాబుకు సరైన అవగాహన వచ్చిందని అంటున్నారు. ప్రతీ జిల్లాలో ఇలా చూసి మరీ పనిమంతులకే బాబు ప్రోత్సహిస్తున్నారు అనుకుంటున్నారు.