Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Andhra

చిరంజీవిని వెనకేసుకొచ్చిన పవన్ కల్యాణ్

చిరంజీవిని వెనకేసుకొచ్చిన పవన్ కల్యాణ్

ఈ విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ రాజకీయ చతురతను మెచ్చుకొని తీరాల్సిందే. తనకు అవసరమైనప్పుడు, అవసరమైన రీతిలో, సందర్భానుసారం చిరంజీవిని వాడుకోవడంలో పవన్ కల్యాణ్ ఎప్పుడో ఆరితేరారు. ఇప్పుడు మరోసారి తన 'కళ' ప్రదర్శించారు.

గతంలో ఇదే పవన్ కల్యాణ్, ఎన్నో సందర్భాల్లో చిరంజీవిని ఆడిపోసుకున్నారు. ప్రజారాజ్యం విషయంలో, వ్యక్తిగతంగా బహిరంగ వేదికలపైనే చిరంజీవితో విభేదించారు. ఒకానొక టైమ్ లో తన పొలిటికల్ మైలేజీ కోసం చిరంజీవిని రాజకీయాల్లో అసమర్థుడిగా చిత్రీకరించడానికి కూడా పవన్ వెనకాడలేదు. దీనికి సంబంధించి వీడియోలు యూట్యూబ్ లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.

ఇలాంటి వ్యక్తి, ఇప్పుడు తన అన్నయ్య చిరంజీవిని వెనకేసుకొచ్చారు. దీనికి కారణం ఆయన కూటమికి మద్దతివ్వడమే. నిజానికి ఆయన కూటమికి మద్దతివ్వలేదు. కూటమిలో కొంతమందికి మాత్రమే ఆయన మద్దతుంది. కానీ టీడీపీ తన ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా, పవన్ తో కలిసి చిరంజీవిని తమకు అనుకూలంగా వాడేస్తోంది.

ఈ సంగతి పక్కనపెడితే.. చిరంజీవిని సజ్జల ఏదో అన్నారని, ఆయనపై విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్. చిరంజీవిని అజాత శత్రువు అంటూ పొగుడుతూనే, అన్నయ్య జోలికి రావొద్దు అంటూ బహిరంగ హెచ్చరిక చేశారు.

"సజ్జల గారికి నేను ఒకటే చెబుతున్నాను. మా అన్నయ్య చిరంజీవి జోలికి రావొద్దు. ఆయన అజాత శత్రువు. ఆయన ఏ పార్టీకి మద్దతిస్తారనేది ఆయనిష్టం. గతంలో అన్నయ్య వైసీపీకి మద్దతిచ్చారు. ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడలేదు. 3 రాజధానులు మంచిదేనని మీరు ఆయన్ను ఒప్పించారు. దాంతో ఆయన 3 రాజధానులకు అనుకూలంగా మాట్లాడారు. రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడ్ని అయిన నేను ఆ రోజు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. ఈరోజు ఆయన కూటమికి మద్దతిచ్చారు."

ఇప్పుడాయన కూటమికి అనుకూలంగా మాట్లాడారు కాబట్టి తనవాడు అయ్యాడు. అయితే తన ప్రసంగంలో సజ్జల వ్యాఖ్యల్ని ఖండించడం కంటే, చిరంజీవి అంశాన్ని తనకు, కూటమికి అనుకూలంగా మార్చుకోవడానికే పవన్ ఎక్కువ ఉత్సాహం చూపించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?