రాస‌లీల‌ల ఎమ్మెల్యే, బాధితురాలి ఎపిసోడ్‌.. బిగ్ ట‌ర్న్‌!

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని ఎలాగైనా లైంగిక ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట ప‌డాల‌ని ప్ర‌భుత్వంలో కీల‌క పాత్ర పోషించే వ్య‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇందులో భాగంగా ఆదిమూలం, బాధితురాలైన తెలుగు…

తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని ఎలాగైనా లైంగిక ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట ప‌డాల‌ని ప్ర‌భుత్వంలో కీల‌క పాత్ర పోషించే వ్య‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇందులో భాగంగా ఆదిమూలం, బాధితురాలైన తెలుగు మ‌హిళా మండ‌ల అధ్య‌క్షురాలు వ‌ర‌ల‌క్ష్మి మ‌ధ్య రాజీ ప్ర‌య‌త్నాలు కొలిక్కి వ‌చ్చిన‌ట్టు తెలిసింది.

ఈ కార‌ణంగానే బాధితురాలు వైద్య ప‌రీక్ష‌ల‌కు స‌సేమిరా అంటున్నార‌ని స‌మాచారం. మూడు రోజుల క్రితం ఆదిమూలంపై బాధితురాలు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మూడు ద‌ఫాలు త‌న‌పై ఆదిమూలం లైంగిక దాడికి పాల్ప‌డ్డార‌ని ఆమె ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోల‌ను కూడా ఆమె బ‌య‌ట‌పెట్టారు.

సొంత పార్టీ నాయ‌కురాలి ఆరోప‌ణ‌ల్ని టీడీపీ అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకుంది. వెంట‌నే ఆదిమూలంపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఇదంతా ప్ర‌జ‌ల్లో పార్టీకి, ప్ర‌భుత్వానికి రాజ‌కీయంగా న‌ష్టం కాకుండా టీడీపీ అప్ర‌మ‌త్తం అయ్యింద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం.

అనంత‌రం బాధితురాలి ఫిర్యాదు మేర‌కు ఆదిమూలంపై తిరుప‌తి ఈస్ట్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. కానీ వైద్య ప‌రీక్ష‌ల కోసం బాధితురాలు అంగీక‌రించ‌లేదు. దీని వెనుక ప్ర‌భుత్వ పెద్ద‌ల డైరెక్ష‌న్ వున్న‌ట్టు తెలిసింది. ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదిర్చి, దీని వెనుక వైసీపీ కుట్ర వుంద‌ని ఏదో ఒక ప్ర‌ముఖ నాయ‌కుడి పేరు చెప్పించే ఆలోచ‌న‌లో టీడీపీ అధిష్టానం ఉన్న‌ట్టు తిరుప‌తి జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

17 Replies to “రాస‌లీల‌ల ఎమ్మెల్యే, బాధితురాలి ఎపిసోడ్‌.. బిగ్ ట‌ర్న్‌!”

  1. సొల్లు అప్పరా అయ్యా! ఈ ఇద్దరూ Y.-.C.-.P వాళ్ళే! 2024 లొనె TDP లొకి వచ్చారు! ఇక ఆ దిక్కుమ్మలిన పనులన్ని కూడా 2023 లొ అయన Y.-.C.-.P MLA గా ఉన్నప్పుడు చెసినవె!

    .

    మరి Y.-.C.-.P లొ ఉన్న సన్నాసు లు అందరూ ఇలానె ఉంటారు ఎమొ! రాజి కుదిరిస్తె Y.-.C.-.P నె కుదర్చాలి.

  2. As I suspected, MLA was suspended in a drama to showoff for publicity while the entire case is being watered down behind the scene and if possible blame opposition party leaders with fake propaganda using yellow media and trollers. This is another lesson from visionary politics!! Are you learning Jagan and Pavan?

  3. అంటే ఇప్పుడు మెల్లగా బాధితురాలి personality assassination చేసి తర్వాత మూలశంక అన్నని క్లీన్ చిట్ ఇస్తారేమో

  4. ఈ వ్యవహారంలో మొగుడు “నువ్వెళ్ళి వాడితో ఆ పనులు చేయి ఒక పెన్ కెమెరా ఇస్తా” అనడం ఒక ఎత్తు అయితే 2-3 సార్లు హోటల్లో వాడితో ఆ పనిలో ఉండి.పబ్లిక్ ప్లేస్లో వాడిని ఎక్సపోజ్ చేసే అవకాశం ఉండి కూడా ఆ పని చేయకపోవడం,హైదరాబాద్లో ప్రెస్మీట్,పార్టీ దృష్టికి ఇవేవీ తీసుకురాకపోవడం ఇలా చాలా ఉన్నాయ్..

Comments are closed.