సుజ‌నాచౌద‌రిలో తెలియ‌ని అసంతృప్తి!

బీజేపీ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రిలో తెలియ‌ని అసంతృప్తి వున్న‌ట్టు కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

బీజేపీ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రిలో తెలియ‌ని అసంతృప్తి వున్న‌ట్టు కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏ మాట‌కామాట చెప్పుకోవాలంటే సుజ‌నా చౌద‌రి హుందాగా వ్య‌వ‌హ‌రిస్తారు. అధికారంలో ఉన్నా, లేక‌పోయినా ఎదుటి వాళ్ల‌పై నోరు పారేసుకోరు. ఇంకెవ‌రి మెప్పు కోస‌మో, ప్ర‌త్య‌ర్థుల్ని తూల‌నాడ‌రు. బ్యాంకుల‌కు ఎగ‌నామం పెట్టార‌నే ఆరోప‌ణ‌లు ఉండొచ్చు. రాజ‌కీయ నాయ‌కుల‌పై అలాంటివి స‌ర్వ‌సాధార‌ణ‌మ‌య్యాయి.

బ‌డ్జెట్‌పై చ‌ర్చ‌లో భాగంగా సుజ‌నా చౌద‌రి సుతిమెత్త‌గా కూట‌మి స‌ర్కార్ డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట పెట్టారు. అస‌లు ఆదాయ‌న్ని పెంచుకునే మార్గాలు బ‌డ్జెట్‌లో బూత‌ద్దం పెట్టి వెతికినా క‌నిపించ‌డం లేద‌న్న ఒకే ఒక్క విమ‌ర్శ‌తో చాలా విష‌యాల్ని ఆయ‌న తెర‌పైకి తెచ్చిన‌ట్టైంది.

ఆదాయం సృష్టించి, సంక్షేమ ప‌థ‌కాల్ని అందిస్తామ‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే అంటుంటారు. ఆ ఆదాయం మార్గాలేవీ బ‌డ్జెట్‌లో లేవ‌ని సుజ‌నా విమ‌ర్శించ‌డాన్ని విశ్లేషిస్తే, ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు చేస్తామ‌న్న హామీల‌పై అనుమానం క‌లుగుతుంది. అంతేకాదు, మ‌రో కీల‌క అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. పోల‌వరానికి కేంద్ర ప్ర‌భుత్వం నిధులు ఇస్తున్న‌ప్పుడు , ఈ బ‌డ్జెట్‌లో మీరెందుకు చేర్చారో అర్థం కావ‌డం లేద‌ని సుజ‌నా చౌద‌రి ప్ర‌శ్నించారు.

కూట‌మి స‌ర్కార్‌లో భాగ‌స్వామి అయిన పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధి బ‌డ్జెట్‌పై అనుమానాలు వ్య‌క్తం చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. సుజ‌నా చౌద‌రి బ‌డ్జెట్‌పై విమ‌ర్శ‌లు చేసినంత మాత్రాన‌, ఆయ‌నేదో కూట‌మికి వ్య‌తిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురేస్తార‌ని ఎవ‌రూ అనుకోరు. కానీ ఆయ‌న‌లో పాల‌న‌పై తీవ్ర అసంతృప్తిని ప్ర‌తిబింబిస్తోంద‌న్న అభిప్రాయాన్ని మాత్రం ఎవ‌రూ కొట్టి పారేయ‌లేరు. అది కూడా సంద‌ర్భాన్ని చూసుకుని త‌న మ‌న‌సును బ‌య‌ట పెట్టార‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

గ‌తంలో టీడీపీలో ఆయ‌న ఓ వెలుగు వెలిగారు. మోదీ కేబినెట్‌లో మంత్రిగా ప‌ని చేశారు. ఎన్డీఏ నుంచి బ‌య‌టికి రావాల‌న్న నిర్ణ‌యం త‌ప్ప‌ని, అప్ప‌ట్లో చంద్ర‌బాబుకు చెప్పారు. కానీ బాబు వినిపించుకోకుండా త‌గిన మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పుడు కూడా ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై ఆయ‌న‌లో తీవ్ర‌మైన అసంతృప్తి వుంద‌ని అంటున్నారు. అందుకే అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తూ, త‌న నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కే ప‌రిమితం అయ్యారు. అస‌లు తానంటూ ఒక‌డున్నాడ‌ని ఎక్క‌డా ఆయ‌న మీడియాలో పోక‌స్ కాక‌పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.

6 Replies to “సుజ‌నాచౌద‌రిలో తెలియ‌ని అసంతృప్తి!”

  1. ముందు నీ విజయసాయి రెడ్డి లొ ఎమి అసంత్రుప్తి ఉందొ చూసుకొరా అయ్యా!!

  2. ఫస్ట్ పేరా చూసి సుజనా మీద ఇంత లవ్ ఏంటబ్బా అనుకున్న. తర్వాత అర్ధమైంది…ప్రభుత్వాన్ని విమర్శించాడు అని

Comments are closed.