జనసేన మంత్రులు.. ఏం జ‌రుగుతోంది?

జ‌నసేన తమతో వుండాలి. కానీ మరీ ఎదగడం, ఎలివేషన్లు ఇవ్వడం అన్నది వుండకూడదు

ఏమన్నా అంటే నెగిటివ్ థాట్ ప్రాసెస్ అంటారు లేదా జ‌నసేన- తెలుగుదేశం బంధం చూసి ఇబ్బందిపడుతున్నారు అంటారు. కానీ లోలోపల వారికి తెలుసు.. జ‌రుగుతున్నది కళ్ల ముందు కనిపిస్తోంది.

జ‌నసేన మంత్రులు ఎందరు? ముగ్గురు.. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్. ఎమ్మెల్యేలు దాదాపు ఇరవైకి పైగా. ముగ్గురు మంత్రుల్లో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పేర్లు తెలుగుదేశం అనుకూల దినపత్రికలు రెండింటిలో చూసి ఎన్నాళ్లయింది?

పవన్ పేరు ఈ మధ్య రెండు సందర్భాల్లో కనిపించింది. ఒకసారి అగస్టు 15 సందర్భ వార్తల్లో, రెండోసారి గ్రామకమిటీల సమావేశాలకు సంబంధించిన వార్తల్లో.

నాదెండ్ల మనోహర్ పేరు చూసి ఎన్నాళ్లయింది. మంత్రిగా మారిన తొలినాళ్లలో చేసిన హడావుడి ఇప్పుడు ఏమయింది? ఎందుకు నాదెండ్ల పేరు అస్సలు కనిపించడం లేదు. వినిపించడం లేదు.

కందుల దుర్గేష్ సంగతి అయితే ఇక చెప్పనక్కరలేదు. లోకల్ గా ఎమ్మెల్యేలకు వస్తున్న కవరేజ్ కూడా ఎందుకు అంతంత మాత్రంగా వుంది? సీఎం రమేష్ పేరు పత్రికల్లో కనిపించినంతగా కొణతాల పేరు కనిపిస్తోందా? నిజానికి ఎంపీ పేరు కన్నా ఎమ్మెల్యే పేరు ఎక్కువగా కనిపించడం అన్నది మనకు తెలిసిన సంగతి.

స్పీకర్ ను నియమించిన వెంటనే డిప్యూటీ స్పీకర్ ను నియమిస్తారు. స్పీకర్ పోస్ట్ అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ప్రతిపక్షానికి ఇవ్వడం ఓ సంప్రదాయం. ప్రతిపక్షం ఎలాగూ లేదు. డిప్యూటీ స్పీకర్ పదవి మరి జ‌నసేనకు ఎందుకు రాలేదు. అది కూడా అధికార తెలుగుదేశానికి చెందిన కాల్వ శ్రీనివాసులకే ఇస్తున్నారనే వార్తలు ఎందుకు బయటకు వచ్చాయి? పదవుల పంపకం సమానంగా వుండాలన్నదే కదా పొత్తుకు కీలకం.

సరే, పదవుల సంగతి పక్కన పెడదాం, సీఎం చంద్రబాబు పేరు తరువాత నిత్యం లోకేష్ పేరు వార్తల్లోనే వుంటూ వస్తోంది. సీఎం చంద్రబాబుకు ఎంత ఎలివేషన్ ఇవ్వాలో అంతా ఇస్తున్నారు. అది సహజం. లోకేష్ కు కూడా ఇంచుమించుగా అలాంటి కవరేజ్‌నే దక్కుతోంది.

ఎమ్మెల్యేల కవరేజ్‌ మెయిన్ పేజీల్లో వుండదు. అందరికీ తెలిసిందే. చిన్న పేపర్లలో అయినా కనిపించాలి కదా. జ‌నసేన ఎమ్మెల్యేల కార్యకలాపాలు మరి అంతగా వుండడం లేదో లేదా కవరేజ్ ఇవ్వడం లేదో మొత్తానికి ఏదో జ‌రుగుతోంది.

డిప్యూటీ సీఎం అని జ‌నసేన శ్రేణులు సంతోషించడం వరకు బాగానే వుంది. కానీ పవన్ తీసుకునే ఏ నిర్ణయానికి కూడా సరైన ఎలివేషన్ రావడం లేదు. పంచాయతీకి పదివేలు వంతున స్వాతంత్ర్య వేడుకులకు ఖర్చు చేయండి అనే నిర్ణయం తీసుకుంటే సింపుల్ వార్త అయిపోయింది తప్ప, సీఎం సమీక్షలకు ఇచ్చే రేంజ్ ఎలివేషన్లు కనిపించ లేదు.

మొత్తానికి చూస్తుంటే జ‌నసేన తమతో వుండాలి. కానీ మరీ ఎదగడం, ఎలివేషన్లు ఇవ్వడం అన్నది వుండకూడదు అనే విధమైన స్ట్రాటజీ ఏదో అమలు జ‌రుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు కొట్టి పడేయచ్చు. అసూయతోనో, అక్రోశంతోనో చెప్పే మాటలు అని తోసి పుచ్చేయవచ్చు. కానీ ఇదే పద్దతి మరి కొన్నాళ్లు కొనసాగితే జ‌నసేన శ్రేణులే ఈ విషయాన్ని గ్రహిస్తాయి.

32 Replies to “జనసేన మంత్రులు.. ఏం జ‌రుగుతోంది?”

  1. మరీ అంత feel అవకు. We are happy with the respect PK is getting. Infact just couple of days back CM had a review meeting with PK on his portfolios.

  2. మా ఎమ్ ఎల్ ఏ జనసేన పార్టీ…అతని పేరు రోజూ లోకల్ డిస్ట్రిక్ట్ ఎడిషన్ లో చూస్తూనే ఉంటాం

  3. మఒదటి కోరిక. మోడీ దిగిపోవాలి. రెండో ది. పావన చంద్ర బాబు కొట్లా ఢీ కోవాలి . మూడో కోరిక ప్యాలెస్ చుట్టూ 900 మంది పోలీసు లు. ఉండాలి ఇనుప కంచెలు రుషికొండ వైభవ లు మల్ల రావాలి . ఇసుక గ్రానైట్. మద్యం మల్ల తినాలి

  4. వారెవరెవరే. జనసేన మంత్రుల పేర్లు చెప్పగలిగావు. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పేర్లు చెప్పగలవా?

  5. పాపం ఇలాంటి చెత్త ఆర్టికల్స్ రాస్తుంటే జనాలు ఉమ్మోస్తున్నారు అని ఏడుస్తూనే మళ్లీ చెత్త ఆర్టికల్స్ ని రాస్తున్నాడు

  6. పవన్ ఇప్పటికే 16 గంటలు పనిచేస్తున్నాడు, ఇంకా ఏమి చెయ్యాలి బాబు? పంచాయితీ ని వైసీపీ వాళ్ళు కుడిపేసారు… ప్రక్షాళిస్తున్నాడు,

    అటవీ శాఖ మీద చర్యలు మొదలు పెట్టాడు, ఏనుగులు పంటలు నాశనం చేస్తుంటే, కర్ణాటక తో ఒప్పందం చేసాడు కుంకీ ఏనుగుల దిగుమతి కి

    కాల్వల్లో పేరుకుపోయిన చెత్త నిర్మూలన కై అంఫిబియాన్ వెహికల్స్ కొని వాటి తో విజయవాడ లో తీయిస్తున్నారు

    జగన్ రైతులకు ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలు మనోహర్ తీర్చాడు, కాకినాడ మ్మెల్యే దోచిన రేషన్ బియ్యానికి తీసుకునే చర్యల కోసం బాబు పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు, తెనాలి కాల్వలన్నీ క్లీన్ చేయించాడు

    దుర్గేష్ టాలీవుడ్ టీం ని అమరావతి లో మీడియా సిటీ లో నిర్మాణాలకు తన వంతు ప్రయత్నిస్తున్నాడు

    ఇంకా బాబు చేస్తున్నది రాయాలంటే ఆ పేజీ సరిపోదు, ఇంకా ఏమి కావాలి మీకు, ఒక బండెడు బురద?

    1. Memu malla 2029 lo. వస్తా. అప్పుడు మీరు వేయించిన చెట్లు కొట్టేసి పర్ధాలు srarat

  7. బానిసలు ఎం హక్కు ఉంటుంది.. ఎం తెలివి ఉంటుంది.. ? వాళ్ళ పని బానిసత్వమే… 2028 ఎండింగ్ లో జనసేన పొత్తు నుండి బయటకి వచ్చేసి.. మేము కూటమిని వ్యతిరేకిస్తున్నాం అని ఇంత నోరు వేసుకొని చెప్తారు… ఎలక్షన్ లో ఓట్లు చీల్చేసి… మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ లాభం వల్ల మళ్ళీ కలిసిపోతారు.. అంతే.. అంతకు మించి ఎం జరిగేది ఉండదు..

  8. These ministers are committee Kurrollu. One is working on constituting a committee to give 3 free cylinders, one is working on constituting a committee to hike ticket prices for OG and other mega family films and the last one is constituting a committee to decide if any action needs to be taken.

  9. వావ్, ఇన్నాళ్ప తిట్టిన పవన్ గారి మీద గ్రేట్ ఆంద్ర కి ఓక్కసారిగా ప్రేమ పొగుకొచ్చింది.. ఏమోటబ్బ.

Comments are closed.