పాత ఎజెండాతో విజయ్ కొత్త పార్టీ జెండా

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ కొత్త పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తన పార్టీకి తమిళ వెట్రి కళగం అనే పేరు పెట్టాడు. ఈరోజు పార్టీ జెండాను కూడా ఆవిష్కరించాడు. చెన్నైలోని తన…

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ కొత్త పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. తన పార్టీకి తమిళ వెట్రి కళగం అనే పేరు పెట్టాడు. ఈరోజు పార్టీ జెండాను కూడా ఆవిష్కరించాడు. చెన్నైలోని తన పార్టీ ఆఫీస్ లో ఆర్భాటంగా పార్టీ జెండాను ఆవిష్కరించాడు విజయ్. ఈ సందర్భంగా అతడు చేసిన వ్యాఖ్యలు పార్టీ ఎజెండాను కూడా చాటిచెబుతున్నాయి.

జెండా ఆవిష్కరణ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు, సైనికులకు నివాళులు అర్పించిన విజయ్.. కులం, మతం, ప్రాంతం ఆధారంగా నడుస్తున్న వివక్షను తెలిగిస్తానని ప్రకటించాడు. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాల కోసం కృషి చేస్తానని, సమానత్వం అనే సూత్రమే తమ పార్టీ బలమని ఆయన ప్రకటించుకున్నారు.

చెప్పుకోడానికి ఈ నివాదాలు బాగుంటాయి కానీ ఆచరణ సాధ్యం కాదు, మరీ ముఖ్యంగా ఈ కాలానికి సెట్ అయ్యే నినాదాలు కూడా కావు. దీనికితోడు తమిళ రాజకీయ విశ్లేషకులు దీనికి సంబంధించి కొన్ని పాత విషయాల్ని గుర్తుకు తెస్తున్నారు. దశాబ్దాల కిందట ఎమ్జీఆర్ పార్టీలోకి స్థాపించినప్పుడు.. ఆ తర్వాత ఆమె రాజకీయ వారసురాలిగా జయలలిత రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు దాదాపు ఇదే తరహా నినాదాలిచ్చారని గుర్తుచేశారు.

ప్రస్తుత తమిళ రాజకీయాలకు ఈ పాత నినాదాలు ఏమాత్రం పనికిరావని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం తమిళనాట యువత సంఖ్య గణనీయంగా ఉందని, వాళ్లంతా అభివృద్ధిని కోరుకుంటున్నారని, విజయ్ ఆ దిశగా తన పార్టీ ఎజెండాను రూపొందిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

మరో రెండేళ్లలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని విజయ్ తన పార్టీ జెండా, ఎజెండా లాంటివి ఖరారు చేస్తున్నాడు. సినిమాలు కూడా మానేస్తున్నానని ప్రకటించాడు. అయితే సరైన ఎజెండా లేకపోతే చతికిలపడాల్సి ఉంటుందంటున్నారు. ఇదే విషయంలో కమల్ హాసన్ వెనుకబడిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

9 Replies to “పాత ఎజెండాతో విజయ్ కొత్త పార్టీ జెండా”

  1. “కులం, మతం, ప్రాంతం ఆధారంగా నడుస్తున్న వివక్షను తెలిగిస్తానని ప్రకటించాడు”

    “దశాబ్దాల కిందట ఎమ్జీఆర్ పార్టీలోకి స్థాపించినప్పుడు.. ఆ తర్వాత ఆమె రాజకీయ వారసురాలిగా జయలలిత రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు”

    తెలుగిస్తాడా?

    పార్టీలోకి స్థాపించడమా?

    MGR అంటే స్త్రీలింగమా? పుంలింగమా?

    మొత్తానికి తెలుగుకి పట్టిన చీడ లాగా తయారయ్యారు.

  2. అందరికి సమాన హక్కులంటే అగ్ర కులాల వాళ్ళు విజయ్ ని నెత్తిన పెట్టుకుంటారు, కానీ రిజర్వేషన్స్ తీసే సత్తా విజయ్ కు వుందా?

Comments are closed.