టీడీపీ, జ‌న‌సేన‌లోకి వైసీపీ కార్పొరేట‌ర్లు

తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో కొంద‌రు కార్పొరేట‌ర్లు టీడీపీ, జ‌న‌సేన‌లో చేర‌డానికి సిద్ధ‌మ‌య్యారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కొంద‌రు కార్పొరేట‌ర్లు జంప్ చేయ‌డానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఇవాళ కొంత మంది కార్పొరేట‌ర్లు…

తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో కొంద‌రు కార్పొరేట‌ర్లు టీడీపీ, జ‌న‌సేన‌లో చేర‌డానికి సిద్ధ‌మ‌య్యారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కొంద‌రు కార్పొరేట‌ర్లు జంప్ చేయ‌డానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఇవాళ కొంత మంది కార్పొరేట‌ర్లు విజ‌య‌వాడ‌కు వెళ్లిన‌ట్టు తెలిసింది.

వీళ్ల‌లో కొంద‌రు జ‌న‌సేన‌, టీడీపీల‌లో చేర‌డానికి రెడీ అయ్యిన‌ట్టు తెలిసింది. తిరుప‌తి మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోడానికి టీడీపీ, జ‌న‌సేన ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. ఇందులో భాగంగానే కార్పొరేట‌ర్ల‌ను చేర్చుకోడానికి రెడీ కావ‌డం గ‌మ‌నార్హం.

మేయ‌ర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాల‌ని అనుకుంటున్న‌ప్ప‌టికీ నాలుగేళ్ల ప‌రిమితి అడ్డంకిగా మారింది. అయితే పుర‌పాల‌క చ‌ట్టానికి స‌వ‌ర‌ణ కూడా చేసి, రాష్ట్ర వ్యాప్తంగా త‌మ పార్టీల్లో చేర‌ని వాళ్ల‌ను దింపేయాల‌ని కూట‌మి స‌ర్కార్ ప్ర‌య‌త్నిస్తోంది. రెండేళ్ల‌కే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అనువుగా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో బిల్లు ప్ర‌వేశ పెట్ట‌డానికి కూట‌మి స‌ర్కార్ ఏర్పాట్లు చేసింది.

టీడీపీ, జ‌న‌సేన‌లో వైసీపీ కార్పొరేట‌ర్లు చేర‌డం వ‌ల్ల త‌మ‌కు ప్రాధాన్యం త‌గ్గుతుంద‌ని కూట‌మిలోని కొంద‌రు నేత‌లు వాపోతున్నారు. అయిన‌ప్ప‌టికీ మేయ‌ర్ స్థానాన్ని ద‌క్కించుకోడానికే అయిష్టంగా అయినా కార్పొరేట‌ర్ల‌ను చేర్చుకోక త‌ప్ప‌డం లేద‌ని కూట‌మి నేత‌లు అంటున్నారు.

6 Replies to “టీడీపీ, జ‌న‌సేన‌లోకి వైసీపీ కార్పొరేట‌ర్లు”

  1. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు చాలా మంది ఇలాంటి turncoat corporators, chairman లు ఇలాగే అధికార congress లో చేరారు..results లో ఇసుమంతా కూడా party కి లాభం కలగలేదు.

  2. జగన్ గాడు ఒక చోట తిన్నగా ఉండడు.. చేసేవీ అన్నీ గబ్బు పనులు .. బయట మాత్రం దర్జాగా పిట్ట కబుర్లు చెప్తూ తిరుగుతాడు .. ఇన్ని కే సు లు పడ్డాకా కూడా కుక్క తోక వంకర అన్నట్లు పోయి పోయి మళ్లీ ఇంకో కొత్త స్కాం లో ఏలు పెట్టాడు నిన్ను నమ్ముకున్న paytm కు క్కలు ఏమ్ మొరుగుతాయో చూడాలి ఇపుడు

  3. జగన్ గా డు ఒక చోట తిన్నగా ఉండడు.. చేసేవీ అన్నీ గ బ్బు పనులు బయట మాత్రం దర్జాగా పిట్ట కబుర్లు చెప్తూ తిరుగుతాడు .ఇన్ని కే సు లు పడ్డాకా కూడా కు క్క తో క వంకర అన్నట్లు పోయి పోయి మళ్లీ ఇంకో కొత్త స్కాం లో ఏలు పెట్టాడు నిన్ను నమ్ముకున్న paytm కు క్క లు ఏమ్ మొ రు గు తా యో చూడాలి ఇపుడు.

Comments are closed.