సీఎంగా లోకేశ్ వ‌ద్ద‌ని అర్థ‌మా?

రాజ‌కీయ నాయ‌కుల మాట‌ల‌క అర్థాలే వేరు. రాజ‌కీయ నాయ‌కులు పైకి మాట్లాడేవన్నీ నిజం అనుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్టే. ఎవ‌రికి అర్థం కావాలో, వాళ్ల‌కు అర్థ‌మ‌య్యేలా రాజ‌కీయ నాయ‌కులు మాట్లాడుతుంటారు. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా…

రాజ‌కీయ నాయ‌కుల మాట‌ల‌క అర్థాలే వేరు. రాజ‌కీయ నాయ‌కులు పైకి మాట్లాడేవన్నీ నిజం అనుకుంటే ప‌ప్పులో కాలేసిన‌ట్టే. ఎవ‌రికి అర్థం కావాలో, వాళ్ల‌కు అర్థ‌మ‌య్యేలా రాజ‌కీయ నాయ‌కులు మాట్లాడుతుంటారు. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా 150 రోజుల పాల‌న‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.

మ‌రో ప‌దేళ్ల‌పాటు ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబే వుంటార‌ని వ‌ప‌న్ అన‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. లోకేశ్‌ను సీఎం చేయాల‌నే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఉన్న‌ట్టు కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐదేళ్ల పాల‌న పూర్త‌య్యే లోపు లోకేశ్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సీఎం చేసే అవ‌కాశాలే ఎక్కువ‌నే చ‌ర్చ టీడీపీలో అంత‌ర్గ‌తంగా సాగుతోంది.

అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ లోకేశ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భ‌ర్తీలోనూ లోకేశ్ నిర్ణ‌యాలే ముఖ్యం. అన‌ధికారికంగా లోకేశ్ సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం మ‌రో ప‌దేళ్ల పాటు చంద్ర‌బాబునే సీఎంగా చూడాల‌ని ప్ర‌క‌టించ‌డం వెనుక‌, లోకేశ్‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం వుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

లోకేశ్ తీరుపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ అసంతృప్తిగా ఉన్నార‌నే వార్త‌లొస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించ‌డం, మ‌రోవైపు లోకేశ్‌ను ప‌రోక్షంగా వ్య‌తిరేకిస్తూ త‌న‌దైన రాజ‌కీయం ప‌వ‌న్ చేస్తున్నార‌ని చెప్పొచ్చు. ఎవ‌రెంత కాలం సీఎంగా వుండాల‌నేది జ‌నం తేలుస్తారు. ఈ విష‌యం ప‌వ‌న్‌కు తెలియంది కాదు. అయిన‌ప్ప‌టికీ లోకేశ్‌ను రెచ్చ‌గొట్టేందుకే చంద్ర‌బాబే మ‌రో ప‌దేళ్లు సీఎం అన్నార‌నే టాక్‌.

51 Replies to “సీఎంగా లోకేశ్ వ‌ద్ద‌ని అర్థ‌మా?”

  1. అదే లోకేష్ CM అవ్వాలి అంటే, “అయితే బాబు చచ్చిపోవాలా ” అని రాస్తావు. నువ్వొక్కడివే చర్చిస్తూ అందరికి అపాదిస్తావు. గొప్పోడివిరా నువ్వు

    1. కరెక్ట్. కెమరామెన్ గంగ తో రాంబాబు లో అలీ లా ఉన్నాడు ఈ ఆర్టికల్ రాసినవాడు

  2. పెద్దగా…పని లేదు అనుకుంటా!!! కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నావ్

  3. ఎలాగూ ఈ టర్మ్ తర్వాత బాబు వయసు రీత్యా రిటైర్ అవ్వచ్చు , టిడిపి వాళ్ళేమో లోకేష్ నీ మోస్తున్నారు. అది దృష్టిలో ఉంచుకొనే ఈ మాటలు. టీడీపీ మరీ లోకేష్ నీ సిఎంగా ప్రొజెక్ట్ చేస్తే ఈయన కచ్చితంగా వ్యతిరేకిస్తాడు.

  4. పిసికావు లే పేడ…

    గత 5 ఏళ్ళు గా నానా పెంట రాసావు.. ఒక్కటి కూడా నిలబడలేదు…

    ఓడిపోయాక అయినా మీ తప్పులు తెలుసుకుని. ప్రజల పక్షాన నిలుస్తారు అనుకుంటే..

    అన్నియ అసెంబ్లీ కి డుమ్మా… రికార్డెడ్ ప్రెషమీట్స్.

    అవే రోత రాతలు.. మీరు ఇలాగే ఉంటే ఆ 11 కూడా మిగలవు

  5. చంబా బాబా ఎంతగా pk ను వాడేసుకొంటున్నాడో తెలుసుకోలేంత కాలం ఇలాగే ఉంటాయి ఆలోచనలు . ఇనా జనసైనికులు కు పక్క పార్టీ జెండా మోయాలి అని చెప్పే రాజకీయ నాయకులు అత్యంత అరుదు

  6. వైఎస్ఆర్ సీఎంగా మరణిస్తే పదవి కోసమే ప్రాంతీయ పార్టీ పెట్టిన ఐదేళ్లలో దిగజారిన వారికి నీమద్దతూ

  7. NTR party ni lakkunna vedhavalaki support chese vallu kuda comment lu pedithe ela? That to abaddalu cheppe 420, yellow media news nammi. Aina evvadu party petina vallu cm kosam kani pakkodu ni cm kosam kaadu

  8. Adani bribery case: AP Govt officials `received’ $200 million bribes for power supply deal in 2021, says indictment – Hindu Business line

    ఎవడ్రా ఎవడ్రా వీడు ? రెడ్డి గారు కొంచెం చెప్పండి ప్లీజ్
  9. నిన్ను ఎవరైనా నిండు నూరేళ్లు వర్ధిల్లు నాయనా అంటే, చల్లగా ఉండమని అర్థం. అంతే కానీ మిగతా వాళ్ళని తొందర లో చచ్చిపోమ్మని కాదు తిరకసాంధ్ర.

  10. అది కాదు అర్ధం. జగన్ ప్రభుత్వం లో తప్పులు పట్టడం కన్నా వీళ్ళ పొత్తు విచ్ఛిన్నం చేయడానికి కాచుక్కూచున్నాడు. అది తెలిసే అతన్ని టీజ్ చేయటానికి చెప్పుంటాడు.

  11. 😂😂😂… మన అన్నయ్య మరీ అంత వెధవ లాగ కనిపిస్తున్నాడా GA…. అసలు లెక్కలోకే తీసుకోకుండా ఉక లో ఈక లాగ తీసి పడేశావు పాపం….

      1. అన్నియ్యా భాష సరిచేసుకో అన్నియ్యా. మీరు మారరా? ఎందుకు బూతు మాట లేకుండా ఒక్క పదం రాదు మీకు? ఏమన్నా అంటే మమ్మల్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారు అంటారు. మీ బూతులు విని చీము నెత్తురు ఉన్నవాడు ఎవరికైనా ఆవేశం వస్తుందే మరి అధికారం ఉన్నవాళ్లు ఊరుకుంటారా? పైగా అతని కామెంట్స్ లో ఎక్కడైనా బూతు కనుపించిందా? ఇప్పటికైనా మారండి. సమాజాన్ని చెడగొట్టకండి 🌹🙏🌹

  12. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. కట్టెల పొయ్య లో పొగపెడుతున్నావ్.. లంగ్స్ లో చిల్లు పడి పోయేట్టున్నావ్

  13. Why are you bothered about Kutami govt?! If PK said CBN should continue as CM for another ten years that means he is not in race to CM post in 2029. Anyhow YCP will be defunct by 29 with Jagan approach to every issue which people are observing closely. So don’t bother and don’t try to poke.

  14. దాని అర్ధం ఏమిటంటే “పులివెందుల పులకేశి” తప్ప TDP లో చంద్రబాబు ఉంటే మంచిదని అర్ధం. మీరు ఎన్ని అబద్దాలు వండి వార్చినా నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.

  15. పవన్ గారు డిసైడ్ చేస్తే అదే జరుగుద్ది బాబు గారు పది సంవత్సరాలు ఉంటే దాదాపు ap లో పోలవరం ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామికాభివృద్ధి కచ్చితం గ జరుగుతుంది వైసీపీ మరుగున పడిపోతుంది అప్పుడు పోటీ పవన్ లోకేష్ గార్ల మధ్య ఆరోగ్యకర పోటీ ఉంటుంది ఇప్పుడు కూటమి రోడ్ టోల్ టాక్స్ వేసేకన్నా జగన్ &కో తినేసి న సొమ్మును కక్కించి రోడ్స్ వంటివి వేస్తె భారత్ దెస చరిత్రలోనే దీని కి సాటి వచ్చేది ఏది లేదు చంద్రబాబు గారికి పవన్ వంటి శక్తివంతమైన నాయకుడు అండగా ఉండగా బయపడాల్సింది లేదు తోలు తీసి వసూలు చెయ్యటానికి A B వెంకటేశ్వర రావు గారిని వేస్తె నిర్దిష్ట కాల పరిమితి లో వసూలు చేసేస్తాడు

  16. గ్రేట్ ఆంధ్రా పేరు సూపర్, నువ్వు రాసే రాతలే… ఆంధ్రా పరువు తీసేలా ఉంది… ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు ఏదో లా ఉంది..

  17. CBN గారు ఉంటే నాకు ఒకే … లేదంటే కుదరదు అని పవన్ గారి అంతరార్ధం.

    1. కుదరకపోతే పెట్టె బేడ సర్దుకుని కూటమి నుండి నిక్షేపంగా దొబ్బేయొచ్చు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ టిడిపి కి అవసరం లేదు.

      1. చంద్రబాబు ki మీరే ఈ విషయం చెప్పి ఆ తరవాత pawan kalayan గారికి చెప్పాల్సింది. పెట్టి బేడా ఎవరు సర్దుకుండురో.

        ఈ పాటికీ భోజనాలు కూడా ఫుల్ గా పెట్టేస్తారు ycp వాళ్ళు.

  18. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్ర బాబు నాయుడు లాంటి సూపర్ ఎఫెక్టివ్ సిఎం కావాలి.he meant that.dont get over excited.Lokesh takes his own time to become CM.

    Meanwhile,Please give us total information about Fbi adani case linked to Andhra Pradesh bro

Comments are closed.