ఈ మధ్య తెలుగు సినిమాకు పట్టిన పిచ్చి లేదా అలవాటు చేసుకున్న ఫ్యాషన్…పెయిడ్ ప్రీమియర్లు. అంటే విడుదలకు ముందు రోజే నాలుగు అయిదు పెద్ద పట్టణాల్లో రాత్రి ఏడు గంటలకు ఒక్కో షో వేసి, టికెట్ లు అమ్మడం. ఒక వేళ టికెట్ ల బుకింగ్ రెస్పాన్స్ బాగుంటే మరో షో ప్లాన్ చేస్తున్నారు.
మంచి కాంబినేషన్, ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, బజ్ వున్న సినిమాలకు ప్రీమియర్లు వర్కవుట్ అవుతాయి. అది కూడా సినిమా మీద పూర్తి నమ్మకం వుంటే. సినిమా కచ్చితంగా పూల్ ప్రూఫ్ గా వుందని నమ్మితేనే ప్రీమియర్లు వేయాలి.
అలా కాకుండా వేలం వెర్రిగా ప్రతి సినిమా ప్రీమియర్లు వేసుకుంటూ పోతే, నష్టమే తప్ప లాభం వుండదు. అన్ని సినిమాల ప్రీమియర్లకు టికెట్ లు తెగవు. తెలిసినవాళ్లకి ఇచ్చుకోవాలి తప్ప మరో మార్గం వుండదు. పోనీ అలా ఇచ్చినా కూడా ఫలితం వుంటుందా? అంటే అదీ లేదు. సినిమా ఎలా వుందీ అన్నది ప్రచారంలోకి వచ్చేస్తుంది. ఫోన్స్, వాట్సాప్ లు, ట్విట్టర్ లు ఇలా రకరకాలుగా దాంతో మర్నాడు రావాల్సిన ఓపెనింగ్ మీద ప్రభావం పడిపోతుంది.
ఎంత ప్రచారం చేసినా, కంటెంట్ బానే వుండేలా వుంది అనే నమ్మకం కలిగినా కూడా మార్నింగ్ షో లకు టికెట్ లు తెగడం లేదు. అలాంటిది ప్రీమియర్లు వేసి, టాక్ బయటకు వెళ్లిపోయిన తరువాత పరిస్థితి ఏమిటి? హీరోలకు సరదా వుండొచ్చు. తన ఫ్రెండ్స్ కు బంధువులకు సినిమా ముందే చూపించేయాలని ఆతృత వుండొచ్చు. కానీ నిర్మాతలు ఆలోచించుకోవాలి ప్రీమియర్ల విషయంలో.
vc available 9380537747
vc available 9380537747
Call boy works 9989793850
ఈ థియేటర్లు ఎందుకురా బుజ్జీ