దేవర 2.. వుంటుందా? వుండదా?

దేవర సినిమా తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్‌గా మంచి హిట్. ప్రపంచ వ్యాప్తంగా ఏ మేరకు హిట్ అన్నది మేకర్లకే తెలియాలి. మరి ఇంత హిట్ అయింది కనుక దేవర 2 వెంటనే మొదలుపెట్టాలి. లేదా…

దేవర సినిమా తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్‌గా మంచి హిట్. ప్రపంచ వ్యాప్తంగా ఏ మేరకు హిట్ అన్నది మేకర్లకే తెలియాలి. మరి ఇంత హిట్ అయింది కనుక దేవర 2 వెంటనే మొదలుపెట్టాలి. లేదా కనీసం ఓ సినిమా తరువాత అయినా చేయాల్సి వుంటుంది. పుష్ప కు అలానే చేసారు కదా. కానీ ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే దేవర 2 సినిమా వుండే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి.

వార్ 2 సినిమా చేస్తున్నారు. దాంతో పాటే ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కిస్తున్నారు. దాని తరువాత మరో హిందీ సినిమా వుందీ అని టాక్ వుంది. అది కాక సితార- నీల్సన్ సినిమా ఫిక్స్ అయినట్లే. అంటే మరో మూడేళ్ల పాటు ఎన్టీఆర్ డైరీ ఫుల్ అయిపోయింది. మరి ఈ గ్యాప్ లో దేవర సినిమా కు చాన్స్ ఎక్కడ?

పైకి ఎన్ని అంకెలు, ఎన్ని ప్రచారాలు జరిగినా, దర్శకుడు కొరటాల వర్క్ మీద, ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వర్క్ మీద హీరో ఎన్టీఆర్ అంత సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఫ్యాన్స్ కష్టపడి, సోషల్ మీడియాలో బలంగా నిలబడి సినిమా విజయానికి కృషి చేసారని, సినిమా కంటెంట్ ఇంకా బాగుంటే వేరేగా వుండేదనే భావన ఆయనలో వున్నట్లు తెలుస్తోంది. పైగా ఓటిటిలో విడుదలైన తరువాత దేవర సినిమాకు విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. సోషల్ మీడియాలో అది బాగా కనిపించింది. ఓటిటి వ్యూవర్ షిప్‌లో కూడా సరిపోదా శనివారం లీడ్ లో వున్నట్లు కనిపిస్తోంది.

ఇవన్నీ చూస్తుంటే దేవర 2 సినిమా వుండే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది.

17 Replies to “దేవర 2.. వుంటుందా? వుండదా?”

  1. Devara is a painful film to watch. NTR got lucky and it managed to save him an insult of a disaster.

    There is nothing he can write to save DEVARA -2.

    Most stupidest thing I watched ever is Vara Killiing himself. So stupid and senseless.

    Koratala writing is very bad.

    Good job NTR for skipping part 2. Focus on other films to get a deserving hit.

Comments are closed.