మళ్ళీ కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే డిమాండ్ 

ఎన్టీఆర్ ఐదేళ్లు అసెంబ్లీకి రాలేదని.. జయలలిత ఐదేళ్లు అసెంబ్లీకి పోలేదని.. అయినా సరే వాళ్ల ప్రభ ఏమైనా తగ్గిందా అంటూ ప్రశ్నించారు కేటీఆర్.

కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే డిమాండ్ మళ్ళీ వినిపించింది. బీసీ కోటాపై అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుంది. కాబట్టి ఆ సమావేశానికి కేసీఆర్ తప్పక హాజరు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండు చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలని కోరారు.

పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ అసెంబ్లీకి హాజరై పరిపాలనలో తాము చేస్తున్న తప్పులను తెలియచేయాలని, మంచి సలహాలు ఇవ్వాలని కోరారు. అయినా కేసీఆర్ నుంచి స్పందన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కేవలం ఒక్కరోజు మాత్రమే సభకు వచ్చారు కేసీఆర్.

రేపటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలని, తాను కోరుకుంటున్నట్లు, అందుకు ప్రత్యేక ఆహ్వానం ఏమి కానీ అందజేయమని మంత్రి అన్నారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ రేపు సభకు హాజరవుతారని.. లేకుంటే వేరేలా ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. సర్వే గురించి,, సర్వేకు సహకరించని వారు కూడా మాట్లాడడం అర్ధరహితంగా ఉందని, రాష్ట్రంలో 96.9% సర్వే పూర్తిగా జరిగిందన్నారు.

ప్రజల ఓట్లతో శాసనసభకు ఎన్నికైన కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తప్పుబట్టారు. అసెంబ్లీకి హాజరుకాని వారు ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. అలాంటి వాళ్లను ఎన్నికల కమిషన్‌ బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎప్పుడెప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా.. పదేళ్ల పాలనపై కడిగేద్దామా అని సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కానీ.. ఆయన రావట్లేదు. దీంతో.. ఆయన ప్రతి వేదిక నుంచి కేసీఆర్‌ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో ఒకసారి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను తానే అసెంబ్లీకి రావొద్దని చెప్తున్నట్టు కేటీఆర్ చెప్పుకొచ్చారు. తానైనా, మిగతా ఎమ్మెల్యేలంతా కేసీఆర్‌ను అసెంబ్లీ రావొద్దని చెప్తామన్నారు.

అందుకు కారణాన్ని కూడా కేటీఆర్ వివరించారు. రేవంత్ రెడ్డి ఏ వేదికపై మాట్లాడినా కేసీఆర్‌ను తిట్టటమే పనిగా పెట్టుకున్నారని.. అది కూడా తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడేటప్పుడు ప్రజలు టీవీలు ఆఫ్ చేస్తున్నారని.. ఎక్కడ ఆ మాటలు వింటే పిల్లలు పాడవుతారో అని తల్లిదండ్రులు ఛానెల్ మార్చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అసెంబ్లీకి రమ్మంటారని కానీ లోపల మాత్రం మైకులివ్వరని కేటీఆర్ చెప్పారు.

బయట మాత్రం ప్రతిపక్షానికి సరైన సమయం ఇస్తామంటూ గొప్పలు చెప్తారని.. కానీ లోపల మాత్రం కనీసం మాట్లాడేటప్పుడు తమ ముఖాలు కూడా చూపించరని తెలిపారు. మైకులు కట్ చేసినా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కేసీఆర్ తమకు.. ఓ మూడు నాలుగు నెలలు మీరు ఏం మాట్లాడకండని.. ప్రభుత్వం ఏమైనా అడిగితే సూచనలు ఇవ్వాలని.. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని సూచించినట్టుగా కేటీఆర్ తెలిపారు.

అయితే.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే.. సభలో తీవ్రమైన పదజాలంతో తిట్టటం, ఇష్టమొచ్చిన ఆరోపణలు చేయటం షురూ చేశారని తెలిపారు. అందుకే.. రేవంత్ రెడ్డికి అర్థమయ్యే భాషలోనే.. ప్రతిస్పందించాల్సి వచ్చిందని తెలిపారు. మొదలు పెట్టింది వాళ్లేనని.. ఇప్పటికైనా పద్దతి మార్చుకుంటే బాగుంటుందని తెలిపారు. కేసీఆర్ అనే నాయకుడు.. 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్నారని.. అంతకుముందు 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలు తెగించి పోరాడారని, రాష్ట్రాన్ని తీసుకొచ్చారని.. అలాంటి మహానాయకుడిని ఇష్టమొచ్చినట్టుగా.. నోటికి ఎంతొస్తే అంతా అన్నట్టు దూషిస్తున్నారని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన తన తండ్రి అని.. తన తండ్రిని ఇష్టమున్నట్టు తిడుతుంటే ఎలా ఊరుకోవాలని కేటీఆర్ అడిగారు.

తనని తిట్టినా పడతానని.. కానీ తన తండ్రిని తిడితే మాత్రం అస్సలు సహించేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని పిలుస్తున్నారని.. ఆయన స్థాయికి తగిన కాంగ్రెస్ నేతలెవరూ లేరని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటాం.. కానీ నీచమైన, నికృష్టమైన పదజాలంతో తిడుతూ శునకానందం పొందాలనుకునే రేవంత్ రెడ్డి లాంటి నాయకులు ఉన్నంత కాలం కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని తెలిపారు.

రేవంత్‌ రెడ్డి నీచమైన భాషవినడానికి.. వచ్చి అవమానపడటానికి కేసీఆర్ రావాలా అని అడిగారు. “ఇవన్నీ చూస్తూ.. ఎమ్మెల్యేమంతా సార్ మీరేందుకు.. రేవంత్ రెడ్డికి మేం చాలు.. మీరు అసెంబ్లీకి రావొద్ద”ని చెప్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ ఐదేళ్లు అసెంబ్లీకి రాలేదని.. జయలలిత ఐదేళ్లు అసెంబ్లీకి పోలేదని.. అయినా సరే వాళ్ల ప్రభ ఏమైనా తగ్గిందా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. మళ్లీ కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర సీఎంగా చూడటమే తమ లక్ష్యమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బీసీ కోటాపై జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి కూడా కేసీఆర్ వస్తారని చెప్పలేం.

4 Replies to “మళ్ళీ కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే డిమాండ్ ”

  1. MLA గా గెలిపించిన ప్రజలని మోసం చేసి అసెంబ్లీకి వెళ్లకుండా farmhouse లో , palace లో దాక్కునే వెధవలని త్వరలో ప్రజలు రోడ్ల మీద పరిగెత్తించి తంతారు!!

      1. correct bro, అందుకే తల్లీ షెల్లీ ని కోర్ట్ కి లాగాడు, మహామేత కి పావురాల గుట్ట గతి పట్టించాడు ఒక గ్రామ సింహం!!

      2. చిన్న correction bro, చెప్పుతో కొట్టింది, పార్టీ ని తీసుకుంది లపాకి నుంచి NTR నుంచి కాదు, lets face it, it’s democracy, who ever have numbers, triumphs!!

Comments are closed.