పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లలేదో?

చంద్రబాబు వెళ్లాలి అనుకున్నపుడు పవన్ ఎలా వెళ్తారు? అటెన్షన్ అంతా చంద్రబాబుకు వుండాలి కానీ పవన్ కు కాదు కదా.

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఓ మంచి అవకాశాన్ని వదలుకున్నారు. భాజపా కూటమి తరపున ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి, జాతీయ మీడియాను బలంగా ఆకర్షించే అద్భుత అవకాశాన్ని వదలుకున్నారు. పవన్ చాలా తెలివైన వ్యక్తి. తన వెనుక వున్న మంది బలాన్ని తెలివిగా వాడుకుంటూ, తెలివైన రాజకీయాన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా, పవన్ తను ఎలా వెళ్తున్నారో, ఏ దిశగా వెళ్తున్నారో క్లారిటీ వుంది.

లోకేష్ నాయకుడిగా ఎదుగుతున్నారని పవన్ కు తెలియదా.. తెలుసు. తను కేవలం వారానికో, పదికో ఓ వార్తకు పరిమితం అవుతున్నా అని పవన్ కు తెలియదా.. తెలుసు. అయినా మౌనంగా వున్నారు. తాను ఏం చేసినా, తన వెనుక వున్న జనం తనను నమ్ముతారని, తను ఏం చేస్తే దానిని సమర్థిస్తారని పవన్ కు తెలుసు. అదే అతని బలం. తెలుగుదేశాన్ని తిడితే వాళ్లూ తిట్టారు. తెలుగుదేశాన్ని బలపరిస్తే వాళ్లూ సై అన్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ ప్రచారానికి వెళ్లలేదు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని తిట్టడానికి నాగబాబును పంపారు. ఎందుకు? ఇప్పటికే తెలుగుదేశం ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్లి, తిట్టమన్నవాళ్లను తిట్టి వస్తున్నారు పవన్ అనే భావన జనాల్లోకి వెళ్లింది. అందుకే ఈసారి తెలివిగా ఆ బాధ్యత నాగబాబు మీద పెట్టారు. అదే పని పార్టీలో మరెవరికైనా పెట్టొచ్చు. కానీ మళ్లీ పార్టీలో ఎవరో ఎదిగిపోవడం అన్నది పవన్ కు నచ్చదు. అక్కడ మళ్లీ ప్లానింగ్ మిస్ కాదు.

సరే, మరి ఢిల్లీ ఎందుకు వెళ్లలేదు. ఎంత కాదన్నా ఆప్ కు ఎంతో కొంత యూత్ లో ఆదరణ వుంది అని తెలుసు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అది. భాజపాతో గట్టిగా పోరాటం సాగిస్తున్న పార్టీ. ఇప్పుడు పవన్ వెళ్లి ఎవరిని విమర్శించాలి. ఆప్ నే కదా. పనిలో పనిగా కాంగ్రెస్ ను. కానీ ఇక్కడ పవన్ లాజిక్ ఇంకోటి వుంది. పవన్ లాంటి వాళ్లు ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేయాలంటే ముందుగా వాళ్ల లెక్కలు వాళ్లు తెలుసుకుంటారు. ఎక్కడ గెలుపు అవకాశాలు వుంటాయో అక్కడకి వెళ్లి ప్రచారం చేసి, గెలిచిన తరువాత తమదే ఘనత అనేలా ప్రచారాలు సాగించుకుంటారు. ఢిల్లీలో లెక్కలు అలా అంత సులువుగా అందేలా లేవు. తీరా చేసి ప్రచారం చేసిన తరువాత తేడా కొడితే, ఢిల్లీ భాజపా జనాల ముందు పరువుపోతుంది.

పైగా చంద్రబాబు వెళ్లాలి అనుకున్నపుడు పవన్ ఎలా వెళ్తారు? అటెన్షన్ అంతా చంద్రబాబుకు వుండాలి కానీ పవన్ కు కాదు కదా. పవన్ వెళ్తే ఉల్టా అవుతుంది. ఆ సంగతి బాబుగారికి తెలియదా. ప్లానింగ్ ఆయనదే డైరక్షన్ ఆయనదే కదా. మరి పవన్ ఎందుకు వెళ్తారు.

అసలు ఓ సంగతి అంతా గమనించే వుంటారు. నిత్యం పత్రికల్లో ఎవరు హైలైట్ అవుతున్నారు. లోకేష్ నే కదా. కొత్త కొత్త నిర్ణయాలు, ప్రజలు మెచ్చే విధమైన నిర్ణయాలు, దావోస్ లో పర్యటన, కీలక విభాగాల్లో మార్పులు ఇలా ప్రతీదీ ఎవరు చేస్తున్నారు లోకేష్ నే కదా. ఆయనేమీ అలా అని ఉపముఖ్యమంత్రి కాదు. పవన్ తరచు ఉపముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు. ఆయన మద్దతు దారులు ఉపముఖ్యమంత్రి వర్యులు అంటారు. మరి దావోస్ కు చంద్రబాబుతో పాటు పవన్ ఎందుకు వెళ్లలేదో? అంటే ఐటి మంత్రి కనుక లోకేష్ వెళ్లారు అనొచ్చు. పవన్ కూడా వెళ్లొచ్చు కదా. ఎందుకు వెళ్లలేకపోయారు?

అందువల్ల పవన్ ప్రతి అడుగు వెనుక తేదేపా ప్లానింగ్ దాగి వుంటుంది. దానికి అనుగుణంగానే పవన్ ముందుకు వెళ్తున్నారు. అది అంత మంచి పద్దతి కాదని ఆయనకీ తెలుసు. కానీ దాని వెనుక ఆయన స్ట్రాటజీలు ఆయనకు వున్నాయి. వుంటాయి. 2029 లేదా 2034 టార్గెట్ గా పావులు కదుపుతున్నారు పవన్. ఆయనకు చాలా ఓపిక ఎక్కువ. రాజకీయాల్లో అలాంటి వారు అరుదుగా వుంటాయి.

19 Replies to “పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లలేదో?”

  1. Dawos meeting ki పంచాయితీ రాజ్ మంత్రి ఎందుకు వెళ్తాడు. మేకయిన అర్థం అయింది అసలు

    1. ఆయన పంచాయతీ రాజ్ మంత్రా.. ? లేక డిప్యూటీ సీఎం న? మీకైనా క్లారిటీ ఉందా.

      1. అయినా డీసీఎం అందులో సందేహం ఎందుకు .. డీసీఎం కాబ్బటి వెళ్ళాలి అంటారా .. మరి అరడజను డీసీఎం లో ఎవరు వెళ్లారు దావోస్ కి గత పెబుత్వం హయం లో ..

      2. అయ్యా హలోగురు గారూ!

        ముందుగా ఓ కప్పు కాఫీ తాగి, కూర్చొని మళ్లీ మళ్లీ చదువు… ఎందుకంటే ఈసారి వాస్తవం నీ మెదడులో చేరడానికి కాస్త సమయం పడుతుందేమో! 😆

        జగన్ మోహన్ రెడ్డి ఇక సీఎం కాదు!

        ఆంధ్ర ప్రజలు చెంపదెబ్బ కాదు గురూ, ఊహూ… చెంపల దండమే కొట్టారు! బై బై జగన్ అని ఓటింగ్ బూతుల దగ్గరే ఫినిష్ చేసేశారు. కానీ చూస్తుంటే అతను సీఎం అవ్వలేక పోయిన బాధ అతని కన్నా నువ్వే ఎక్కువగా ఫీలవుతున్నావు! ఏం గురూ, జగన్ నిన్ను ‘సొంత బ్యాచ్ అధ్యక్షుడు’గా నియమించాడా? లేక ‘ఫేస్ బుక్ నోటి వీరుడు’గా ప్రమోషన్ ఇచ్చాడా? 😂

        ఇప్పుడో చిన్న పాయింట్ – ప్రజలే ఓడించారంటే అర్థం ఏంటి?

        అంతటితో కాదుగా, ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని తిరస్కరించారంటే అతని పాలన విఫలమైందన్న అర్థం. ఉచితాలంటే పరిపాలన కాదు, అభివృద్ధి లేకపోతే ఓట్లు మళ్లీ రాబోనూ. జగన్ మాయాబజార్ స్కీములు ఫెయిల్ అయ్యాయి, ఎందుకంటే ప్రజలు చివరికి సత్యాన్ని గుర్తించారు. ఇప్పుడు రాష్ట్రం అప్పుల ఊబిలో, పరిశ్రమలు పారిపోయాయి, ఉద్యోగాలు లేవు – ఇవన్నీ నీకు కనబడట్లేదా?

        ఇక నీ మేజర్ డైలాగ్ – “ఏదో బ్యాచ్, ఎవరో డబ్బులు తీసుకుని కామెంట్స్ పెడుతున్నారు…” 🤡

        అయ్యో! మరి జగన్ ఉచిత డబ్బులు పంచినప్పుడు మాత్రం బ్యాచ్ అనిపించలేదా? నువ్వు నీ చేతికి వచ్చిన లబ్ధిదారుల కితాబుతో లెక్కలు చెప్పుకుంటూ కూర్చో… కానీ ప్రజలు మాత్రం చెక్ పెట్టారు! 😂

        ఇదంతా సరే, ఇప్పుడే నీకో సెన్సిటివ్ టాపిక్ చెప్తా

        మీ కామెంట్స్‌కి చూసాను… నీకు రిప్లై ఇచ్చిన వాళ్లలో

        👉 “నే అమ్మకు మొగుడు”

        👉 “అప్పరా కుక్క గారు”

        ఇదుగో వీళ్లిద్దరూ కూడా నీ కన్నా , నీ కన్నా తెలివైన వాళ్లే అనిపించారు!

        మరి చివరికి ఓ మంచి మాట…

        నిజం ఎప్పటికీ నిజమే!

        ✅ జగన్ పూర్తిగా ఓడిపోయాడు.

        ✅ ప్రజలు అతనికి గుణపాఠం నేర్పారు.

        ✅ ఇప్పటికైనా నువ్వు సిగ్గుపడి నిజాన్ని ఒప్పుకో, లేకపోతే ‘నే అమ్మకు మొగుడు’ గారు & ‘అప్పరా కుక్క’ గారి కంటే నీ లెవల్ తక్కువ అయిపోతుంది! 🤣🔥

        #బైబైజగన్ #హలోగురు_సిగ్గుచేసుకో 🚀🔥😆

  2. Hello Mr pawan kalyan?,

    Tirupathi lo ycp corporators kidnap anta ??

    ippudu rara open keep, varaahi, naa bongu ani,

    janam nee kutha lo ganji postaru.

    chachi oorukuntaav 

  3. అసలు నీ రాతలు ఏంటో, నువ్వు ఏంటో!!

    పవన్ ప్రతి అడుగు టీడీపీ ప్లానింగ్ లో దాగి ఉంది అంటావు.

    ఢిల్లీ కి వెళ్లక పోవటానికి కారణం అక్కడ గెలిచే అవకాశం ఆప్ కి ఎక్కువ ఉంది, బీజేపీ కి తక్కువ ఉంది. పవన్ లాంటి వాళ్ళు ఎక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయో అక్కడికి వెళ్లి ప్రచారం చేసి, గెలిచిన తరువాత తమదే ఘనత అని ప్రచారం చేసుకుంటారు అన్నావు. మళ్ళీ నువ్వే, చంద్ర బాబు వెళ్ళాలి అనుకున్నపుడు పవన్ ఎలా వెళ్తారు? ప్లానింగ్, డైరెక్షన్ చంద్రబాబుదే కదా! అంటావు!!

  4. కుంభమేళా లో ప్రధానిగారి స్నాన ఘట్టం చూపించి ఓట్లు అడుగుతారు. ఒక రోజు ముందునుండి ప్రధాని వేసుకునే బట్టలు, ముహూర్తం,ఘాట్ వివరాలు, ప్రాశస్త్యం గురించి బి జె పీ మీడియా నాల్గవతారీకు నుండి ఐదవ తారీఖు మొత్తం రోజంతా ప్రసారం చేయడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. అదే ఢిల్లీ BJP ఎన్నికల ప్రచార అస్త్రం

  5. “రవి గారు, విద్య అంటే సంస్కారం – కానీ మీరు తక్కువ స్థాయి మనస్తత్వం కలిగిన వారితో ఏమి తేడా? దేవుడు మీకు బుద్ధి ప్రసాదించాలి!”

    మీరు చదువుకున్న, సంస్కారవంతుడిగా భావించబడే వ్యక్తి. కానీ కుల విద్వేషాన్ని ప్రోత్సహిస్తూ, అసభ్యులను మద్దతు ఇస్తూ, మీరు తక్కువ స్థాయికి దిగజారిపోతున్నారనే విషయం మీకే అర్థం అవుతోందా? ఈ నీచ స్థాయికి దిగజారడం చదువుకున్న వ్యక్తికి తగినదేనా?

    కుల వివక్ష, అసభ్యమైన వ్యాఖ్యలు, ద్వేషపూరిత రాజకీయాలే ప్రజలను విసిగించాయి. అందుకే, ప్రజలు జగన్‌ను 175 స్థానాల్లో 11 స్థానాలకు పరిమితం చేశారు. జగన్‌ను ప్రజలు ఎంతగా తిరస్కరించారంటే, ఆయనకు ప్రతిపక్ష నేత స్థానం కూడా దక్కలేదు. ద్వేషం, కుల రాజకీయాలే జగన్‌ను ఈ స్థితికి నెట్టాయి. కానీ మీరు మాత్రం ఇంకా అదే మార్గాన్ని అనుసరిస్తూ, కుల విద్వేషాన్ని ప్రోత్సహించే వారిని సమర్థిస్తూ, మీ వ్యక్తిత్వాన్ని మరింత దిగజార్చుకుంటున్నారు.

    ఇలాంటి చీప్ పొలిటిక్స్‌కు మద్దతు ఇస్తూ, మీరు మరింతగా అసభ్యుల సరసన నిలబడుతున్నారన్న సంగతిని గుర్తించండి. విద్య అంటే కేవలం చదువుకోడం కాదు, అది సంస్కారాన్ని కూడా నేర్పాలి. కానీ మీరు తక్కువ స్థాయి మానసికత గల వ్యక్తులతో ఏమాత్రం భిన్నంగా కనిపించడం లేదు.

    ఇప్పటికైనా మారండి! లేకపోతే, మీరు కూడా కుల విద్వేషంతోనే గుర్తింపు పొందిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారు.

    దేవుడు మీకు బుద్ధి ప్రసాదించాలి!

Comments are closed.