ఎంత కోపమైతేమాత్రం ఇలా మాట్లాడొచ్చా?

కేటీఆర్, హరీష్​రావు సీఎం పదవిపై కన్నేశారని, కాబట్టి ఆ పదవి కోసం కేసీఆర్​ను ఖతం చేస్తారని రేవంత్​ రెడ్డి చెప్పాడు.

సీఎం రేవంత్​ రెడ్డికి కేసీఆర్​ అన్నా, ఆయన కుటుంబ సభ్యులన్నా అంటే కొడుకు కేటీఆర్​, మేనల్లుడు హరీష్​ రావు అంటే కోపం ఉండొచ్చు. వాళ్లు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి కోపం ఉండటంలో తప్పులేదు. రాజకీయాల్లో కోపతాపాలు సహజం. కాని అసెంబ్లీలో మాట్లాడుతూ కేసీఆర్​ను కేటీఆర్​, హరీష్​రావు చంపేస్తారేమో అన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. అర్థం వచ్చేలా మాట్లాడటమేమిటి? డైరెక్టుగానే చంపేస్తారని చెప్పాడు.

రేవంత్​ రెడ్డికి ఎంత కోపం ఉంటే మాత్రం తెలంగాణ ఉద్యమం నడిపిన నాయకుడిని, రాష్ట్రం సాధించిన నాయకుడిని, ఒక పార్టీ అధినేతను, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిని కొడుకు, మేనల్లుడే చంపేస్తారని చెప్పడం, అది కూడా అసెంబ్లీలో అలా చెప్పడం ఎంతవరకు సమంజసం? కేటీఆర్, హరీష్​రావు సీఎం పదవిపై కన్నేశారని, కాబట్టి ఆ పదవి కోసం కేసీఆర్​ను ఖతం చేస్తారని రేవంత్​ రెడ్డి చెప్పాడు. ఖతం చేయడమంటే చంపేయడమనే కదా అర్థం.

దీన్ని మరోలా అర్థం చేసుకోవడానికి అవకాశం లేకుండా రేవంత్​ రెడ్డి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. గతంలో నేపాల్​ యువరాజు దీపేంద్ర తనకు పదవి ఇవ్వలేదనే కోపంతో ఏకే 47తో ఎనిమిదిమంది కుటుంబ సభ్యులను కాల్చేశాడని అన్నాడు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఏర్పడకుండా చూడాలని స్పీకర్​ను కోరాడు. అంటే అర్థం ఏమిటి? కేటీఆర్, హరీష్​రావు సీఎం పదవి కోసం కేసీఆర్​ను హత్య చేస్తారనే అర్థం కదా.

11 Replies to “ఎంత కోపమైతేమాత్రం ఇలా మాట్లాడొచ్చా?”

  1. ఏదైనా ఉంటే, మన అన్నలా వేసేయాలి తప్ప, ఇలా మాట్లాడొద్దు అంటావ్ అంతేనా..

Comments are closed.