మీరు బెంగుళూరా.. అయితే మేం మలేషియా!

కూటమి ఇన్ని కష్టాలు పడుతున్నది గానీ.. అవిశ్వాసం నెగ్గే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.

విశాఖపట్నం నగర కార్పొరేషన్ ను దక్కించుకోవడానికి.. పాపం తెలుగుదేశం నానా పాట్లు పడుతోంది. ఇప్పటికే బోలెడంత మంది వైసీపీ కార్పొరేటర్లను రకరకాల ప్రలోభాలు, బెదిరింపులతో తమ జట్టులో కలుపుకున్నారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని తమ పార్టీ చట్టసభల ప్రతినిధులందరినీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా మోహరిస్తున్నారు. ఎంత చేసినా.. కార్పొరేషన్ దక్కుతుందనే గ్యారంటీ కనిపించడం లేదు.

అవిశ్వాసం ఆల్రెడీ మూవ్ చేశారు గానీ.. ఆ తీర్మానం నెగ్గాలంటే.. కార్పొరేషన్ పై కూటమి జెండా ఎగరాలంటే.. ఇంకా నలుగురి బలం కావాలి. కానీ, ముందే జాగ్రత్త పడిన వైఎస్సార్ కాంగ్రెస్ తమ పార్టీ కార్పొరేటర్లందరినీ బెంగుళూరుకు తరలించి అక్కడ క్యాంపు నిర్వహిస్తోంది. అందుకు పోటీగా.. కూటమి జట్టులోని వారినందరినీ మలేషియాకు గానీ, మరో ఇతర దేశానికి గానీ తరలించి క్యాంపు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కూటమి పార్టీల్లోని కార్పొరేటర్లందరి పాస్ పోర్టులను కూడా నాయకులు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

వైసీపీ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి ఆ పార్టీ బెంగుళూరులో క్యాంపు నిర్వహిస్తోంది. ప్రలోభాలతో బెదిరింపులతో లోబరచుకుంటారనేది వారి భయం. ఇప్పుడు వైసీపీలో మిగిలిన 34మందిలో ఏకంగా ఆరుగురిని చేర్చుకోవడానికి స్కెచ్ వేశారు గానీ.. కూటమి పార్టీల పాచిక పారలేదు. బొత్స సత్యనారాయణ స్వయంగా రంగంలోకి దిగి చక్రం తిప్పిన తర్వాత.. వలసలు ఆగాయి.

అయితే కూటమి ఇప్పుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పడినదంటే.. వైసీపీ నుంచి ఇప్పటిదాకా ఫిరాయించి తమ పార్టీలోకి వచ్చిన వారైనా నికరంగా తమతో కలిసి ఉంటారో లేదో.. ఓటింగ్ లోగా తిరిగి వైసీపీలోకి జంప్ చేస్తారో అనే భయంలో వారిలో వ్యక్తం అవుతోంది. అలాంటి భయమే లేకపోతే వారికి క్యాంపు నిర్వహించాల్సిన అవసరమే లేదు. పైగా, కార్పొరేటర్లతో క్యాంపును విదేశాల్లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే అందరి నుంచి పాస్ పోర్టులుకూడా తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే మలేషియా లేకపోతే మరో దేశానికి తీసుకువెళ్లి.. అవిశ్వాసం సమయానికి అందరినీ కలిపి తీసుకురావాలని అనుకుంటున్నారట. కూటమి లోకి ఫిరాయించినందుకు విదేశీయానం యోగం పట్టిందని వారు అనుకుంటున్నారు.

నిజం చెప్పాలంటే.. కూటమి ఇన్ని కష్టాలు పడుతున్నది గానీ.. అవిశ్వాసం నెగ్గే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి వైసీపీ శిబిరంలో ఉన్నవారిలో కనీసం నలుగురు ఇటు మొగ్గితే తప్ప అవిశ్వాసం నెగ్గకపోవచ్చు!

6 Replies to “మీరు బెంగుళూరా.. అయితే మేం మలేషియా!”

  1. ఒకతనికి బెంగుళూరు లో రాయల్ పాలస్ వుంది

    ఒకతనికి మలేసియా లో లగ్జరీ హోటల్ వుంది.

  2. TDP వాళ్ళకి నగర కొర్పొరషన్ దక్కక పొయినా పొయెది ఎమి లెదు! ఎందుకంటె అక్కడ లొగడ గెలిచింది Y.-.C.-.P!

    అదె ఉన్న seat నిలుపొలెకపొతె ఇక జగన్ అయిపొయింది, గెలిచిన నాయకులు కూడా అందరూ పార్టి వదిలి వెల్లిపొతున్నారు అనుకొవాలి ఎమొ!

    1. ప్రజలు కావలసిన దాని కన్నా ఎక్కువ బలం ఇచ్చారు. ఎందుకు జగన్ తప్పులు సరి దిద్దటానికి ? కానీ కూటమి ఇలా గెలిచినా వారిని దౌర్జనం , ప్రలోభ పెట్టి దాడులు చేసి గెలిస్తే జగన్ ఏ నయం అనే స్థితికి వచ్చేటట్లు చేస్తున్నారు

Comments are closed.