''చంద్రబాబు, ఆయన శిష్య గణానికి ప్రతిదీ నెగెటివ్‌గా కనిపించడానికి 'రిటైర్మెంట్ సిండ్రోమ్' కారణం. పదవులు పోవడం, ప్రజలు పట్టించుకోకపోవడం, మొన్నటివరకు ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించిన వారంతా అదృశ్యమవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉంటుంది. బయట పడటం అంత తేలికేమీకాదు.'' అంటూ ట్వీట్ చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. లోకేష్ ట్వీట్లకు ట్విటర్ ద్వారానే సమాధానం ఇస్తున్న విజయసాయి రెడ్డి, ఆయనపై కూడా కొన్ని సెటైర్లు వేశారు. లోకేష్ వరస ట్వీట్లపై సాయిరెడ్డి మరోసారి స్పందించారు.
''చిత్తుగా ఓడి కూడా 'హింసించే రాజు 23వ పులకేశి' లాగా లోకేశ్ ప్రజలను టార్చర్ చేస్తున్నాడు. ఎన్నికలప్పుడు చేసిన చవకబారు విమర్శలనే మళ్లీ వదులుతున్నాడు. చంద్రబాబు కొడుకు కాబట్టి దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి మంత్రిగా మూడు శాఖలను భ్రష్టు పట్టించాడు. కీచురాళ్ల రొదలాగా ఏదేదో ట్వీటుతున్నాడు.'' అంటూ మరో ట్వీట్ పంచ్ విసిరారు.
లోకేష్ ట్విటర్లో ఏం రాసుకోవాలో అర్థంకాక మళ్లీ పాత కామెంట్లే చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ పై గత దశాబ్దకాలంగా తెలుగుదేశం పార్టీ ఏ విమర్శలు చేసిందో లోకేష్ మళ్లీ వాటి వైపే వెళ్లిపోయారు. రోజూ ఏదో ఒకటి ట్వీట్ చేయాలంటే.. పాత కథలే మళ్లీ మళ్లీ రాసుకోవాల్సిందే కదా. అందుకే లోకేష్ టీమ్ పాత విమర్శలనే మళ్లీ పోస్టు చేస్తున్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి ఇలా స్పందించారు.