సిల్వర్ స్క్రీన్ పైకి మరో సింగిల్ టేక్

మొన్నటికి మొన్న డియర్ కామ్రేడ్ సినిమాలో సింగిల్ టేక్ లో ఓ సాంగ్ తీశారు. అదే క్యాంటీన్ సాంగ్. త్వరలోనే విడుదలకాబోతున్న కొబ్బరిమట్ట సినిమాలో సంపూర్ణేష్ బాబు ఏకబిగిన 3 నిమిషాల డైలాగ్ చెప్పాడు.…

మొన్నటికి మొన్న డియర్ కామ్రేడ్ సినిమాలో సింగిల్ టేక్ లో ఓ సాంగ్ తీశారు. అదే క్యాంటీన్ సాంగ్. త్వరలోనే విడుదలకాబోతున్న కొబ్బరిమట్ట సినిమాలో సంపూర్ణేష్ బాబు ఏకబిగిన 3 నిమిషాల డైలాగ్ చెప్పాడు. అది కూడా సింగిల్ టేకే. ఇక ఫలక్ నుమా దాస్ సినిమాలోనైతే 10 నిమిషాల క్లైమాక్స్ సీన్ ను సింగిల్ కట్ లో తీశారు. ఇప్పుడు అలాంటిదే మరో సింగిల్ టేక్ షాట్ తెరపైకి రాబోతోంది. ఇది నాగశౌర్య సినిమాలో ఉంది.

అవును.. నాగశౌర్య సినిమాలో కూడా సింగిల్ షాట్ లో తీసిన 3 నిమిషాల యాక్షన్ సన్నివేశం ఒకటి ఉండబోతోంది. గత సినిమాల్లా కాకుండా ఇది ప్రేక్షకులకు మరింత థ్రిల్ ఇస్తుందని చెబుతున్నారు. ఇలాంటి యాక్షన్ సీన్ ఒకటి చేయబోయి ప్రమాదానికి గురయ్యాడు నాగశౌర్య. అయినప్పటికీ, కోలుకొని మళ్లీ అవే యాక్షన్ సీన్లు చేయాలని ఫిక్స్ అయ్యాడు. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న అన్బు అరివు, ఈ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు.

తన సొంత బ్యానర్ పై నాగశౌర్య చేస్తున్న ఈ సినిమాతో రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ లో సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ మూవీకి అశ్వద్ధామ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమా కథను స్వయంగా నాగశౌర్య రాసుకున్నాడు.

బాబుతో పాటు అతనూ వైసిపిని ఢీకొనే ప్రయత్నం చేసేవాడేమో!