నైరుతి రుతు పవనాలు కాలంతో పాటు రావాలి. అవి ప్రతీ ఏటా నిర్దిష్ట సమయానికి కాస్తా ముందో వెనకో వస్తాయి. కానీ ఈసారి మాత్రం ఠంచనుగా వచ్చేశాయి. జూన్ నెల రావడమేంటి నైరుతి రుతుపవనాలు ఎంటరైపోయాయి. మండించే వేసవి ఎండల్లో నైరుతి చల్లని చినుకులు చిందిస్తూ జనాలకు పూర్తి ఉపశమనం కలుగచేస్తోంది.
నైరుతి ఇలా కరుణించడానికి కారణం ఏంటి అంటే దాని గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బాగా చెప్పారు. నారా బాబులు ఇద్దరూ ఏపీలో లేకపోవడం వల్లనే అనుకున్న టైమ్ కి నైరుతి ఏపీలో సందడి చేసిందట. అంతే కాదు ఎల్లెడలా బాగా వానలు కురుస్తున్నాయట.
మరో నాలుగు నెలల పాటు పెదబాబు, చినబాబు హైదరాబాద్ లోనే కాపురం ఉంటే చాలు, చల్లగా వానలు ఏపీని తడిపి తరింపచేస్తాయని విజయసాయిరెడ్డి సెటైరికల్ గా విన్నపాలు చేసుకుంటున్నారు. మొత్తానికి నారాకు, నైరుతికీ మధ్య ఇలాంటి తమాషా అయిన లింక్ ఉందని వైసీఎపీ నేతలు చెప్పడమే కాదు, గతానుభావాలను కూడా గుర్తు చేస్తున్నారు.
బాబు ఏలుబడిలో వానలు పెద్దగా కురియవు అన్న విమర్శలు ఉన్న నేపధ్యంలో ఈ కామెంట్స్ కి రియాక్షన్ బాగానే వస్తోందిట.