తెల్లారిలేతే వైసీపీ సర్కార్ ని తిట్టడానికి ఇపుడు తెలుగుదేశం పార్టీకి అర్జంటుగా జనాలు కావాలి. సొంత పార్టీలో తమ్ముళ్ళు అయితే ఊరికే తిట్టేదేలా ఏమీలేని దానికి అంటున్నారుట. అవును మరి టీడీపీ అధినాయకత్వం వారి మీద పెట్టిన బాధ్యత చిన్నదా మరి.
ఏకంగా ప్రభుత్వం మీద విమర్శలు చేయాలంటూ వారం రోజులకు సరిపడా షెడ్యూల్ ని కూడా పై నుంచి పంపించారట. దీంతో ఇది తమ వల్ల అయ్యే పని కాదు అంటూ డుమ్మా కొట్టేశారు విశాఖ తెలుగు తమ్ముళ్లు.
నిజంగా ప్రభుత్వం వైపు నుంచి తప్పు ఉంటే తామే వాటిని జనంలో పెట్టి తూర్పరా పడతామని, ఏమీ లేకుండా గాలిని పోగు చేయడం, దుమ్మెత్తి పోయడం లాంటి రాజకీయ విన్యాసాలు అసలు చేయలేమని తమ్ముళ్లు చేతులెత్తేశారుట.
విశాఖ జీవీఎంసీలో మూడు పదుల సంఖ్యలో టీడీపీ కార్పోరేటర్లు గెలిచారు. అయితే వీరిని ఇలా మౌనంగా ఉంచకుండా ప్రభుత్వం మీద విమర్శలు చేయిస్తూ రచ్చ చేయాలని భావించిన హై కమాండ్ కి పలువురు తమదైన ధోరణిలో గట్టి ఝలక్ ఇచ్చేశారుట.