వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లు.. ప్రతిపక్ష టీడీపీకి వణుకు పుట్టిస్తుంటాయి. తాజాగా ఆయన వేసిన ఓ ట్వీట్ మరింత సంచలనంగా మారింది. టీడీపీ భవిష్యత్ పై ఆ పార్టీ నేతల్లో కలవరం పుట్టిస్తోంది. ఇంతకీ జులై-23 ఏం జరుగుతుంది అంటూ టీడీపీలో చర్చ మొదలయ్యేలా చేశారు విజయసాయి.
ఇంతకీ విజయసాయి ఏమన్నారంటే..?
“23వ తేదీ టీడీపీకి కాలరాత్రి. రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. రెండేళ్ల క్రితం గురువారం, మే 23న టీడీపీ అంతలా వణికింది. గోడదెబ్బ-చెంపదెబ్బ అన్నట్లుగా ఈ ఏడాది జులై 23 శుక్రవారం వస్తోంది. ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా..? దేవుడు ఏం రాసిపెట్టాడో?” అని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
సరిగ్గా రెండేళ్ల క్రితం 2019 మే-23న ఎన్నికల ఫలితాలు రావడం టీడీపీ 23 సీట్లకే పరిమితం కావడం తెలిసిందే. అప్పటితో రాష్ట్రానికి పట్టిన శని వదిలిందని, జగన్ ప్రభంజనం మొదలైందని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. అంతవరకు బాగానే ఉంది. అయితే గోడదెబ్బ-చెంపదెబ్బలాగా ఈ ఏడాది జులై-23న పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడో? అని టీజింగ్ గా పెట్టిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏం జరుగుతుంది..?
23మంది టీడీపీ ఎమ్మెల్యేలలో నలుగురు ఆల్రడీ చంద్రబాబుని ఛీ కొట్టారు. వారితోపాటు మరికొందరు వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారనేది తెలిసిందే. మరి వారి చేరికకు, లేదా టీడీపీకి వారు చేసే రాజీనామాలకు జులై-23ని మహూర్తంగా పెట్టుకున్నారా..? అనేది డౌట్. పచ్చ పార్టీ పటాపంచలవుతుందన్న ట్వీట్ కి అర్థం అదేనంటూ కొంతమంది చెబుతున్నారు. లేదా చంద్రబాబు విషయంలో వైసీపీ ఇంకేదైనా ప్లాన్ చేసిందా అనేది కూడా తేలాల్సి ఉంది.
మొత్తమ్మీద విజయసాయి ట్వీట్ కి చిత్ర విచిత్రమైన మెసేజ్ లు వస్తున్నాయి. ఆ మహూర్తానికి ఏం జరుగుతుందో చెప్పండంటూ.. చాలామంది విజయసాయిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఈ ట్వీట్ కలకలం రేపింది.