టీడీపీ నిలువునా చీలుతుంది.. రెడ్డిగారి జోస్యం!

తెలుగుదేశం పార్టీ నిలువునా చీలుతుందని అంటున్నారు బీజేపీనేత విష్ణువర్ధన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చాలామంది బీజేపీతో సంప్రదింపులు చేపట్టారని విష్ణు అంటున్నారు. వీలు చూసుకుని తమ పార్టీ అధిష్టానం వారికీ ఓకే చెబుతుంది అని…

తెలుగుదేశం పార్టీ నిలువునా చీలుతుందని అంటున్నారు బీజేపీనేత విష్ణువర్ధన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే చాలామంది బీజేపీతో సంప్రదింపులు చేపట్టారని విష్ణు అంటున్నారు. వీలు చూసుకుని తమ పార్టీ అధిష్టానం వారికీ ఓకే చెబుతుంది అని విష్ణువర్ధన్ రెడ్డి చెబుతున్నారు. తాము అనుకోగానే.. తెలుగుదేశం పార్టీ నిలువునా చీలడం ఖాయమని విష్ణు అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అలా విచ్ఛిన్నం అయిపోతుందని, రాష్ట్రంలో కొత్త రాజకీయం చూస్తారని ఈయన చెప్పుకొచ్చారు. అంతవరకూ ఓకే కానీ, ఈయన రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకహోదా అంశంలో కూడా కామెంట్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశం ముగిసిపోయింది అని చెప్పుకొచ్చారు. ఈ అంశంలో ఎవరు ఏం చెప్పినా అది ప్రజలను మోసం చేయడమే అని చెప్పుకొచ్చారు.

ఇంత ఈజీగా తేల్చేశారీయన. అయినా పదేళ్ల కిందట ఎన్నికల్లో పోటీచేసి పట్టుమని వెయ్యి ఓట్లు తెచ్చుకోలేకపోయిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇంత తేలికగా తేల్చేస్తూ ఉన్నారు. తనేదో ప్రధానమంత్రి అయినట్టుగా ఈయన మాట్లాడుతూ ఉండటం హాస్యాస్పదంగా ఉంది.

రాష్ట్ర ప్రయోజనాలకు సహకరించుకుండానే తమ పార్టీ ఏపీలో ఏదో బలోపేతం అవుతుందని అనుకుంటే బీజేపీ నేతలు అది పగటి కలలు కనడమే అవుతుంది తప్ప మరోటి కాదని గ్రహిస్తారో లేదో!

ఆత్మవిమర్శ అవసరం.. టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!