రాజ్ తరుణ్.. పక్కన ఆమెనా?

ఆలు లేదు చూలు లేదు అన్నట్లుంది వ్యవహారం. రాజ్ తరుణ్-కొండా విజయ్ కుమార్ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాల దగ్గరేవుంది. రాజ్ తరుణ్ వేరే సినిమా పనిలో బిజీగా వున్నాడు. ఈలోగా అదితిరావ్…

ఆలు లేదు చూలు లేదు అన్నట్లుంది వ్యవహారం. రాజ్ తరుణ్-కొండా విజయ్ కుమార్ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ వ్యవహారాల దగ్గరేవుంది. రాజ్ తరుణ్ వేరే సినిమా పనిలో బిజీగా వున్నాడు. ఈలోగా అదితిరావ్ హైదరీ జోడీ అంటూ వార్తలు వచ్చేసాయి.

రాజ్ తరుణ్-కొండా విజయ్ కుమార్ సినిమాకు ఇప్పటివరకు హీరోయిన్ ఎంపిక కాలేదు. పైగా అదితిరావ్ హైదరి పేరు అసలు ప్రోబబుల్స్ జాబితాలోనే లేదు. ఎందుకంటే రాజ్ తరుణ్ మార్కెట్, సినిమా బడ్జెట్ ఇవన్నీ చూడాలి కదా? అదితి రావ్ తొలిసినిమాకే 65లక్షలకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు బోగట్టా.

పైగా ఆమెకు కొన్ని పద్దతులు వున్నాయి. పార్క్ హయాత్ లోనే వుంటారామె. అలాగే ఆమె స్టాఫ్ ఖర్చు కూడా నిర్మాత భరించాలి. అదికాస్త ఎక్కువే. రోజుకు ముఫై అయిదు వేల వరకు వుంటుంది. అందువల్ల ఇవన్నీ కలుపుకుంటే కాస్త ఎక్కువే అవుతుంది.

ప్రస్తుతం రాజ్ తరుణ్ మార్కెట్ ప్రకారం సినిమా మొత్తం నాలుగైదు కోట్లకు మించకూడదు. ఇలాంటి నేపథ్యంలో అదితిరావ్ పేరును ప్రొబబుల్స్ లోకి ఎలా తీసుకుంటారు. తీసుకోలేదు. కానీ వార్తల్లోకి మాత్రం వచ్చింది. 

ఆత్మవిమర్శ అవసరం.. టీడీపీ ఇంకా ఆ భ్రమల్లోనే ఉంది!