Advertisement

Advertisement


Home > Special News - Health

రెగ్యులర్ సెక్స్ తో ఇన్ని బెనిఫిట్సా..!

 రెగ్యులర్ సెక్స్ తో ఇన్ని బెనిఫిట్సా..!

సెక్సువల్ లైఫ్ లో యాక్టివ్ గా ఉండేవారికి దీని ఫలితంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో లాభాలుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఒకటని కాదు… ఎన్నో లాభాలు అంటూ వీరు ఊరిస్తున్నారు. రాయల్ ఎడిన్ బర్గ్ పరిశోధకులు అయితే.. తమ పదేళ్ల పరిశోధనల ఫలితంగా సెక్స్ లైఫ్ గురించి గొప్ప విషయాన్ని కనుగొన్నామని చెబుతున్నారు. శృంగార జీవితంలో యాక్టివ్ గా ఉండే దంపతులు… యంగ్ గా కనిపిస్తారని వీరు చెబుతున్నారు. ఎంత యంగ్ గా అంటే.. వీళ్ల వయసు కనీసం ఏడెనిమిదేళ్లు తక్కువ అనిపిస్తుందని ఇక్కడి క్లినికల్ న్యూరో సైకాలజిస్టులు చెబుతున్నారు! శృంగారం మహత్తు ఆ స్థాయిలో ఉంటుందని వివరించారు.

ఇంకా.. తరచూ శృంగారాన్ని ఆస్వాధించే వారికి గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధన చెబుతోంది. గాఢమైన శృంగారాసక్తితో అనునిత్యం దాన్ని ఆస్వాధించే వారిలో అపోజిట్ సెక్స్ ను ఆకర్షించే శక్తి పెరుగుతుందని మరో పరిశోధన వివరిస్తోంది. శృంగారంతో విడుదలయ్యే హార్మోన్ల ఫలితమే ఇదని ఈ పరిశోధన సారాంశం.

ఇలా చెప్పుకొంటూ పోతే ఇంకా ఎన్నో.. సర్వ ఆనందానికీ, సర్వ రోగ నివారణలకు.. సెక్స్ ఒక గొప్ప ఔషధం అని శాస్త్రీయమైన పరిశోధనలు చెబుతున్నాయి! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?