సునీల్ తో త్రివిక్రమ్ సినిమా?

ఇవ్వాళ అతగాడు హీరో కావచ్చు..ఇప్పడు ఇతగాడు పెద్ద డైరక్టర్ కావచ్చు..కానీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులు . వాళ్లే సునీల్-త్రివిక్రమ్. సునీల్ ఎదుగదల వెనుక త్రివిక్రమ్ కృషి ఎంతో వుంది. తన పేరు లేకుండానే, త్రివిక్రమ్…

ఇవ్వాళ అతగాడు హీరో కావచ్చు..ఇప్పడు ఇతగాడు పెద్ద డైరక్టర్ కావచ్చు..కానీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులు . వాళ్లే సునీల్-త్రివిక్రమ్. సునీల్ ఎదుగదల వెనుక త్రివిక్రమ్ కృషి ఎంతో వుంది. తన పేరు లేకుండానే, త్రివిక్రమ్ ఎన్నో సినిమాలకు సునీల్ కోసం తన చేతి సాయం చేసాడు. డైరక్టర్ అయిన తరువాత సునీల్ తో సినిమా చేసే అవకాశం ఇంత వరకు కుదరలేదు. 

ఇప్పుడు పెద్ద హీరోలు ఎవరూ అందుబాటులో లేని నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. అయన దగ్గర ఎప్పటి నుంచో ఓ కథ వుంది. అది సునీల్ కోసమే. 

ఇప్పుడు సునీల్ ఆ సంగతి గుర్తు చేసి,తన కోసం త్రివిక్రమ్ ను ఓ సినిమా చేయాలని అడగాలనుకుంటున్నాడట. తన నేస్తం తన మాట కాదనడని సునీల్ నమ్మకం. ఈ నమ్మకం నిజమైతే, త్వరలో సునీల్ తో త్రివిక్రమ్ స్టయిల్ ఫన్ సినిమా ఒకటి చూడొచ్చు.