బండ్ల సినిమా మళ్లీ పూరితోనే?

టెంపర్ సినిమా హడావుడి పూర్తిగా చల్లారింది. అప్పులు, లెక్కలు సంగతి అలా వుంచితే మళ్లీ మరో సినిమా దిశగా నిర్మాత బండ్లగణేష్ అడుగేయాల్సి వుంది. అయితే ఇప్పట్లో మరో సినిమా చేసే అవకాశం లేనట్లు…

టెంపర్ సినిమా హడావుడి పూర్తిగా చల్లారింది. అప్పులు, లెక్కలు సంగతి అలా వుంచితే మళ్లీ మరో సినిమా దిశగా నిర్మాత బండ్లగణేష్ అడుగేయాల్సి వుంది. అయితే ఇప్పట్లో మరో సినిమా చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ముందు, తన పౌల్ట్రీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలపై దృష్టి పెడతాడని వినికిడి. వెంటనే సినిమా చేద్దామని వున్నా, ఏ డైరక్టర్, ఏ హీరో ఖాళీ లేరు. పైగా బండ్ల గణేష్ అంటే…ఎందుకో తెలియదు కానీ, అమ్మో..అనేట్లు టాక్ స్ర్పెడ్ అయింది. 

ఆ మధ్య నిఖిల్ ను అడిగాడు. కానీ ఊ..ఆ అనలేదు అని తెలుస్తోంది. టాప్ హీరోలు ఎవ్వరూ ఆర్నెల్ల నుంచి ఏడాది వరకు ఖాళీ లేరు. అందువల్ల పూరినే పట్టుకుని, ఓ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల బోగట్టా. హీరో నితిన్ మళ్లీ పూరితో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. అది బండ్ల నిర్మించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పైగా బండ్ల తాను తెలంగాణ వాడినని, తన ముత్తాతలది ఆంధ్ర అయినా, తను పక్కా తెలంగాణ వాడినని చెబుతుంటారు. 

అందుకే ఈ సారి తెలంగాణ హీరో నితిన్ తో సినిమా చేస్తారని వినికిడి. పైగా బండ్లకు తెలంగాణ రాజకీయ నాయకులతో మంచి సంబంధాలున్నాయంటారు.  మొత్తం మీద పూరి-నితిన్ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే తప్ప, బండ్ల ఇప్పట్లో సినిమా తేసే అవకాశం అంతగా లేదు.