‘జిల్‌’తో జిగేల్‌మనిపిస్తాడా.?

గోపీచంద్‌ తాజా చిత్రం ‘జిల్‌’ విడుదలకు సిద్ధమైంది. మాస్‌ హీరోగా మంచి ఇమేజ్‌ సంపాదించుకున్న గోపీచంద్‌, వరుస పరాజయాలతో డీలాపడ్డ టైం లో ‘లౌక్యం’ రూపంలో మంచి హిట్‌ వచ్చిందతనికి. ‘లౌక్యం’ హిట్‌ కావడంతో,…

గోపీచంద్‌ తాజా చిత్రం ‘జిల్‌’ విడుదలకు సిద్ధమైంది. మాస్‌ హీరోగా మంచి ఇమేజ్‌ సంపాదించుకున్న గోపీచంద్‌, వరుస పరాజయాలతో డీలాపడ్డ టైం లో ‘లౌక్యం’ రూపంలో మంచి హిట్‌ వచ్చిందతనికి. ‘లౌక్యం’ హిట్‌ కావడంతో, గోపీచంద్‌ తాజా చిత్రం ‘జిల్‌’పై అంచనాలు పెరిగిపోయాయి. ఆల్రెడీ గోపీచంద్‌ రెమ్యునరేషన్‌ విషయంలో బెట్టు చేస్తున్నాడనే గాసిప్స్‌ విన్పిస్తున్నాయి. 

‘జిల్‌’ విషయంలో కూడా పూర్తి కాన్పిడెన్స్‌తో వున్న గోపీచంద్‌, రెమ్యునరేషన్‌ దగ్గరకొచ్చేసరికి అస్సలేమాత్రం రాజీ పడటంలేదట. ‘జిల్‌’తో కూడా హిట్‌ కొడితే, గోపీచంద్‌ రెమ్యునరేషన్‌ ఫిగర్స్‌ నిర్మాతలకి జిగేల్‌మన్పించడం ఖాయమట. ప్రీ రిలీజ్‌ ‘జిల్‌’కి హైప్‌ బాగానే క్రియేట్‌ అయ్యింది. 

ఆ హైప్‌ కారణంగానే బిజినెస్‌ కూడా బాగానే జరిగిందనేది టాలీవుడ్‌ సర్కిల్స్‌లో విన్పిస్తోన్న గాసిప్‌. జస్ట్‌ యావరేజ్‌ అన్పించుకున్నా, గోపీచంద్‌ కెరీర్‌లోనే ‘జిల్‌’ పెద్ద హిట్‌ అవడం ఖాయం. రెమ్యునరేషన్‌ గాసిప్స్‌ సంగతెలా వున్నా, గోపీచంద్‌ ‘జిల్‌’తో హిట్‌ కొడితే, అతని కెరీర్‌ పూర్తిగా గాడిన పడ్డట్లే.