కమల్ సినిమాలు డిఫరెంట్ గా వుంటాయి. కానీ ఇప్పుడు తమిళ భారీ సినిమాలంటే బయ్యర్లు భయపడుతున్నారు. ఒకటా రెండా ఎన్ని దెబ్బలు తిన్నారు గడచిన ఏడాది రెండేళ్లుగా..రజనీ, అజిత్, సూర్య, కార్తీ, ఇలా అందరి సినిమాలు తీసిన దెబ్బలు ఇన్నీ అన్నీ కావు. లేటెస్ట్ గా లింగా కొట్టిన దెబ్బ ఇంతా అంతా కాదు.
అందుకే కమల్ లేటేస్ట్ సంచలనం ఉత్తమ విలన్ ను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వినికిడి. ఆఖరికి కళ్యాణ్ కు చెన్నయ్ లో పరిచయాలు, మొహమాటలు ఎక్కువ కావడంతో, ఆయన ద్వారా విడుదల చేయిస్తున్నారు. విడుదల తేదీలోగా ఎవరైనా కొంటే ఓకె. లేదంటే, నేరుగా విడుదలచేయడమే.
థియేటర్ ఖర్చులు కిట్టుబాటయితే అదే చాలు. లేదూ సినిమా సూపర్ అన్న టాక్ వస్తే అదృష్టమే. ఈ మధ్య సి కళ్యాణ్ లక్ బాగానే వుంది. రెండు డబ్బింగ్ సినిమాలు తక్కువలో తెచ్చి, బాగానే డబ్బులు చేసుకున్నారు. ఆ అదృష్టం ఉత్తమ విలన్ మీద కూడా పడితే మంచిదే.