ఎన్టీఆర్ కు మరో హీరొయిన్ కావాలి

సినిమాకు హీరో ఒక్కరైనా హీరోయిన్లు ఇద్దరుంటే కానీ గ్లామర్ అంతగా పండదు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన సినిమా కోసం మరో హీరోయిన్ కావాలని చూస్తున్నాడట. సుకుమార్ దర్శకత్వంలో భోగవిల్లి ప్రసాద్ నిర్మించే సినిమాకు…

సినిమాకు హీరో ఒక్కరైనా హీరోయిన్లు ఇద్దరుంటే కానీ గ్లామర్ అంతగా పండదు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తన సినిమా కోసం మరో హీరోయిన్ కావాలని చూస్తున్నాడట. సుకుమార్ దర్శకత్వంలో భోగవిల్లి ప్రసాద్ నిర్మించే సినిమాకు ఇప్పటికే రకుల్ ను ఫైనల్ చేసారు. అమె చాలక మరో మాంచి హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారట. 

అయితే మెయిల్ లీడ్ రకుల్ నే. ఒకటి రెండు పాటలకే ఈ కొత్త అమ్మాయి. బాలీవుడ్ నుంచి తేవడమా..లేదా సౌత్ లో ఎవర్నన్నా వెదికి పట్టుకోవడమా అని చూస్తున్నారట. ఈ సినిమా వచ్చే నెల నుంచి యూరప్ లో సెట్ పైకి వెళ్తుంది.