హీరోయిన్లు సినిమాలకు అంత సులువుగా దూరం కావాలని అనుకోరు. అందుకే గిరాకీ బాగా తగ్గిపొయాక కానీ పెళ్లి జోలికి పోరు. త్రిష కూడా అందుకు మినహాయింపు కాదు. అందరూ త్రిష ఆంటీ అనేస్తారనుకనే టైమ్ లో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, నిశ్చితార్థం చేసేసుకుంది. కానీ ఇప్పుడు అవకాశాలు మరింతగా వెదుక్కుంటూ వస్తున్నాయి.
తమిళనాట రెండు మూడు సినిమాలకు ఓకె అంది. తెలుగులో బాలయ్య బాబుతో చేస్తోంది. ఇప్పుడు మళ్లీ మరో సినిమాకు కూడా ఓకె చెప్పిందని తెలుస్తోంది. రవితేజతో రీమేక్ చేయబోయే ఓ బాలీవుడ్ సినిమా ప్రాజెక్టుకు త్రిషను సంప్రదించారట. సంతోషంగా అంగీకరించిందట. రవితేజ..త్రిష హిట్ పెయిర్ అని ఇప్పటికే రుజవయింది కదా.