హీరోయిన్ లకు స్క్రీన్ లైఫ్ స్పాన్ తక్కువ. అందరి హీరోలతో ఒక సినిమా చేయడమే కష్టం.మళ్లీ మరో రౌండ్ వేయాలంటే కాస్త అదృష్టమో, మరీ భయంకరమైన ఇమేజ్ నో కావాలి. అనుష్కలాంటివారికే ఈ జెనరేషన్ లో అది దక్కింది. కొత్త ఫిగర్ వచ్చిందంటే, పాత హీరోయిన్లు ఫేడవుట్ కావాల్సిందే.
ఇప్పడు సమంతకు ఇదే సమస్య వచ్చింది. నిన్నంటి దాకా ఏ మాయ చేసిందో అనుకున్నారు..ఇప్పుడు ఆ మాయ రకుల్ ప్రీత్ సింగ్ చేస్తోంది. మొన్నటికి మొన్న రామ్ చరణ్ దగ్గర అవకాశం కొట్టేసింది. సమంతను పక్కకు నెట్టేసింది.
ఇప్పుడు బన్నీ దగ్గర కూడా అదే మాజిక్ చేసిందని వినికిడి. బోయపాటి-బన్నీ కాంబినేషన్ లో రాబోయే సినిమాకు సమంతను సూచించాడట డైరక్టర్ బోయపాటి. కానీ ఆల్రెడీ సన్నాఫ్ సత్యమూర్తిలో చేసాం కదా..వెంటనే మళ్లీ అదే హీరోయిన్ ఎందుకు అంటూ, రకుల్ పేరు సూచించాడట బన్నీ. తప్పదు కొత్త నీరు వచ్చాక, పాతనీరు పోవాల్సిందే.