ఇంగ్లండ్ డాటర్ చాలా ఓవర్ చేస్తోంది!

ఇండియన్ డాటర్  డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం నిషేధించడంపై ఆ డాక్యుమెంటరీ నిర్మాత లెస్లీ ఉడ్విన్ నోరు పారేసుకొంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం సిగ్గుతో ఉరేసుకోవాలని వ్యాఖ్యానించి ఆమె వివాదం సృష్టించింది. తాను రూపొందించిన…

ఇండియన్ డాటర్  డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం నిషేధించడంపై ఆ డాక్యుమెంటరీ నిర్మాత లెస్లీ ఉడ్విన్ నోరు పారేసుకొంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం సిగ్గుతో ఉరేసుకోవాలని వ్యాఖ్యానించి ఆమె వివాదం సృష్టించింది. తాను రూపొందించిన డాక్యుమెంటరీ ని నిషేధంపై అక్కసో లేక సహజమైన జాత్యాహంకారమో కానీ.. ఈ బ్రిటీష్ డాటార్ ప్రవర్తన మాత్రం చాలా అభ్యంతరకరం.

నిర్భయపై జరిగినది ఘాతుకమే. ఈ విషయం కాదనలేనిది. ఇది కొందరు కిరాతకుల చర్య. ఇలాంటి కిరాతకులు కేవలం భారత్ లోనే ఉంటారు.. అనడమో లేక.. భారతీయులంతా ఇలాంటి కిరాతకులు అనుకోవడానికి మించిన పాపం ఉండదు. అయితే ఈ బ్రిటీష్ ప్రొడ్యూసర్ కు మాత్రం దాదాపు ఇలాంటి అభిప్రాయమే ఉన్నట్టుంది.

నిర్భయ ఉదంతంపై బారతదేశం మొత్తం కదలిపోయింది. ఇక్కడి న్యాయస్థానాలు కూడా కఠినదండన విధించాయి. ఇలాంటి నేపథ్యంలో నిర్భయ హంతకుడి మాటలను హైలెట్  చేసింది డాక్యుమెంటరీ. మరి వాడు హంతకుడు.. వాడి అభిప్రాయాలు అలాగే ఉంటాయి. వాడు చేసిందే ఘాతుకం.. అని నిర్ణయం అయిపోయింది. శిక్ష పడింది. ఇలాంటి సందర్భంలో మళ్లీ వాడి అభిప్రాయాలపై భూతద్దం పెట్టడం ఎందుకు?! ఇక నిర్భయపై డాక్యుమెంటరీ లో లాయర్ల తీరు ఖండించతగినదే. 

వారు నిర్భయ హంతకుల తరపున వకల్తాపుచ్చుకొన్నప్పుడే వారిని వెనుకేసుకొస్తూ వాదనలు ప్రారంభించినప్పుడు మనుషులగా చచ్చిపోయారు. జరిగింది దారుణమే అని చెప్పి శిక్ష తీవ్రత తగ్గించేయత్నం చేయక లాయర్లు.. ఆడపిల్లలందరిపైనా అభాండాలు వేసినప్పుడే.. మనుషులుగా చచ్చారు. ఇలాంటి వారి వ్యవహారాన్ని డాక్యుమెంటరీ వెలికి తీసింది. అక్కడి వరకూ అభినందనలే!

కానీ ఈ బ్రిటిష్ డాటర్ కు తమ దేశంలో జరుగుతున్న ఘాతుకాల గురించి ఎందుకు సినిమాలు తీయాలనిపించలేదు? బ్రిటన్ లో రేపులు జరగడం లేదా? సైకోలు రెచ్చిపోవడం లేదా? వాళ్ల అభిప్రాయాలను చిత్రీకరించి డాక్యుమెంటరీలు రూపొందించి.. బీబీసీలో ప్రసారం చేసుకోకూడదా? ఇలా ఇండియా మీద పడటం లో ఉద్దేశం ఏమిటి? ఇక్కడి ప్రభుత్వంపై 'సిగ్గుతో ఉరేసుకోవాలని' నోరు పారేసుకోవడం ఎందుకు? 

నిజంగా లెస్లీ ఉడ్విన్ అనే ఆమెకు బుర్ర అనేది ఉంటే.. దానితో సామాజిక అంశాలపై స్పందించేంత సీను ఉంటే.. ఇలాంటి అర్థంపర్థం లేని మాటలు మాట్లాడేది కాదు. ఈ మాటలను బట్టి చూస్తే.. ఈమె ఏదో దురుద్దేశంతోనే నిర్భయ అంశంపై దృష్టిసారించినట్టుగా ఉంది.