మీడియాకెక్కినవాడే మొనగాడు

బాబు దృష్టిలో హీరో కావాలంటే మంత్రులు ఏం చేయాలి.. Advertisement మంత్రులు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి.. పెద్దగా కష్టపడక్కర లేదు.  మీడియాలో నిత్యం కనిపిస్తే చాలు..బాబు దృష్టిలో పనిమంతులే. అంతేనా..అయితే కాస్త…

బాబు దృష్టిలో హీరో కావాలంటే మంత్రులు ఏం చేయాలి..

మంత్రులు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి..

పెద్దగా కష్టపడక్కర లేదు. 

మీడియాలో నిత్యం కనిపిస్తే చాలు..బాబు దృష్టిలో పనిమంతులే.

అంతేనా..అయితే కాస్త మీడియాను మంచి చేసుకుని, వారితో స్నేహ సంబంధాలు మెయింటెయిన్ చేయగలిగితే చాలన్నమాటేగా.

అబ్బే..అలా అంటే మళ్లీ మీరు తప్పులో కాలేసినట్లే.

మీడియాలో కనిపించడం అంటే, ఏదో ఒక స్టేట్ మెంట్ పడేసో, సభలు సమావేశాల్లో పాల్గొంటే సరిపోదు..

మరింకేం చేయాలి..

ఫస్టఇ థింగ్ రోజుకో డెవలెప్ మెంట్ గ్యాసిప్ మాట్లాడగలగాలి..

ఇదెక్కటి కొత్త ట్విస్టు అనుకుంటున్నారా..ఇప్పుడు నడుస్తున్న వ్యవహారం ఇదే. సీమాంద్ర జనాలు తెలుగుదేశం పార్టీని ఏదో చేయగల పార్టీ అని ఎన్నుకున్నారు. అందువల్ల చేసేదాకా, చేయగలిగేదాకా..వారిని ఆ ఆనందంలోనే వుంచాలి. ఏదో జరుగుతోంది..అదిగో వస్తోంది..ఇదిగో వస్తోంది అనిపించాలి. అందుకు తగ్గట్టు రకరకాల ప్రకటనలు చేయాలి. అవి గతంలో వున్నవే అయినా ఫరవాలేదు. కావాలంటే చూడండి..దేవాలయాల్లో అన్నదానం. అన్నీ కొత్తగా ప్రారంభించినట్లు బిల్డప్పు..ఏళ్ల తరబడి నడుస్తున్నవే. 

విప్రోకి కొత్తగా విశాఖలో ఏదో చేసినట్లు హడావుడి. నిజానికి ఇక్కడ విప్రోకి చేసింది ప్రయోజనం..అది ఆంధ్రకు ఉద్దరింపు అన్నట్లు ప్రకటన. విప్రోకి గతంలోనే సాఫ్ట్ వేర్ కేంద్రం, డెవలప్ మెంట్ సెంటర్ కు స్థలాలు ఇచ్చారు. సాప్ట్ వేర్ కేంద్రం కోసం నగరం నడబొడ్డున సంపాదించిన స్థలంలో పెద్ద భవనం కట్టడం మినహా చేసిందేమీ లేదు. ఇక డెవలప్ మెంట్ సెంటర్ స్థల అలా వుండనే వుంది. ఇప్పుడు ఏం చేసారు..సదరు డెవలప్ మెంట్ సెంటర్ ను సెజ్ గా మార్చుకోవడానికి హడావుడిగా అనుమతి ఇచ్చేసారు. అంటే ఏమిటి అన్నమాట..ఆ స్థలంతో విప్రో వ్యాపారం చేసుకుంటుంది. ఒక విధంగా అంతేగా..సెజ్ కింద మార్చకుంటే విప్రో ఏం చేయాల్సి వచ్చేది..స్వంతంగా దాంట్లో డెవలప్ మెంట్ సెంటర్ పెట్టాలి. అందుకు స్వంత డబ్బు ఖర్చు చేయాలి. ఇప్పుడు సెజ్ కింద మార్చడంతో, కొంత భాగం ఇతర సంస్థలకు ఇచ్చి డబ్బు చేసుకోవచ్చు..ఆ మొత్తం ఉద్యోగ కల్పనను విప్రో సెజ్ కారణంగా వచ్చినట్లు చెప్పుకోవడమే.నిజనికి ఇన్నేళ్లు స్థలాలను వృధాగా ఎందుకు వుంచినట్లు? 

సరే ఈ సంగతి అలా వుంచి మళ్లీ మంత్రుల సంగతి దగ్గరకు వస్తే, గడచిన నెల రోజులుగా ఫస్ట్ రాంక్ కొట్టేసిన మంత్రుల మీడియా వార్తలన్నీ దగ్గర పెట్టుకుని గమనించండి. మూడు రకాల వార్తలు కనిపిస్తాయి.

ఒకటి ఇది..వస్తుంది..అది వస్తుంది..ఇది చేస్తాం..అది చేస్తాం.. జిల్లాకో ఓడరేవు.మూడు జిల్లాలకు రెండు విమానాశ్రయాలు. అయ్యా..అసలు ఆర్టీసీ డిపోలను అందంగా చేయండి..అక్కడ సదుపాయాలు కల్పించండి..వర్షం పడితే ఏ బస్ట్ స్టాండ్ లోకి వెళ్లే పరిస్థితి లేదు. కావాలంటే కాకినాడ లాంటి పెద్ద ఆర్టీసీ బస్ స్టాండ్ కు ఓ వర్షంవేళ ఎవరైనా మంత్రుల వెళ్లచ్చు. ఇవన్నీ సామాన్యుడికి అవసరమైనవి. విమానాశ్రయాలు తరువాత. కర్ణాటక లాంటి హై ఇన్ కమ్ వున్న రాష్ట్రమే విమానాశ్రయాలపై ఇంతలా దృష్టి పెట్టలేదు. మరి మనకెందుకు? విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప లేదా కర్నూలు..ఇలా అయిదు చాలవా? విజయనగరంలో విమానాశ్రయం ఎందుకండీ బాబూ…జిఎమ్ ఆర్ సంస్థ వారు. వారి స్వస్థలానికి వెళ్లడానికి, విమాన శాఖ మంత్రి తన ఇంటికి వెళ్లడానికి తప్ప మరి ఎవరికి ఉపయోగం? 

రెండవది..ఆసుపత్రి సదుపాయాలు లేవని మంత్రి మండిపాటు..ఫలానా సంస్థ లో సదుపాయాలు లేవని మంత్రి మండిపాటు. 

ఆసుపత్రిలో కావచ్చు..మరే సంస్థలో కావచ్చు సదుపాయాలు సరిగ్గా లేకపోతే మండిపడాల్సింది ఎవరిపైనా..అక్కడ పనిచేసే సిబ్బంది పైనా..లేక సదుపాయాలు కల్పించాల్సిన వారిపైనా? ఆసుపత్రి రోజు వారీ నిర్వహణ మాత్రమే అక్కడున్నావారు చేయగలిగింది. ఓ సదుపాయం కావాలన్నా, భవనం కావాలన్నా, మరేది కావాలన్నా రాష్ట్రస్థాయి అధికారులు, సంస్థలు ఇవ్వాలి. మరి వారిపై కదా మండిపడాల్సింది..కానీ ఘనత వహించిన మంత్రులు అలా చేయరు. వారికి కావాల్సింది..అప్పటికప్పుడు మీడియా ఫోకస్. మంత్రి మండిపడ్డారు..మర్నాటి లోకల్ టబ్లాయిడ్ కు బ్యానర్..అంతే. 

మూడో తరహా వార్తలు వున్నాయి

గడచిన పదేళ్లలో ఇది నాశనం..అది నాశనం.. ఈ తరహా వార్తలు.చిత్రమేమిటంటే, ఇలా నాశనం చేసారు కాబట్టే జనం మిమ్మల్ని రంగంలోకి తెచ్చారు. వాళ్లే సరిగ్గా చేసి వుంటే, తెలుగుదేశం పార్టీ ముచ్చటగా మూడోసారి ప్రతిపక్షంలో కూర్చునేది..ఈ మంత్రులు ఖాళీగా వుండేవారు. మరి ఆ సంగతి తెలిసీ, ఇంకా ఎందుకు పాత రంకులు తవ్వుకోవడం? అంటే ఇంకా అదే హ్యాంగోవర్ నడుస్తోంది కాబట్టి..బాబు అదేపని శ్వేతపత్రాలు అంటూ చేస్తున్నారు కాబట్టి..మనం అలాగే చేయాలని.

ఇప్పుడు అర్థమై పోతుంది..బాబు అడుగుజాడల్లో నడిస్తే..చాలు మంత్రులుగా ఫస్ట్ ర్యాంక్ కొట్టేయచ్చు..

చాణక్య

[email protected]