పలు హిట్ చిత్రాల్లో నటించిన నాని ఇప్పుడు హీరోగా చాలా బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో అతనికి రెండు ఘోరమైన పరాజయాలు ఎదురయ్యాయి. అంతకుముందున్న ఫ్లాపులకి ఈ డిజాస్టర్లు తోడవడంతో నాని మార్కెట్ బాగా డౌన్ అయింది. దీంతో విడుదలకి రెడీగా ఉన్న అతని సినిమా కూడా వెనక్కి పోయింది.
ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ‘జెండాపై కపిరాజు’ ఫైనల్‌గా రిలీజ్ అవుతోంది. ఆగస్ట్ 8న దీనిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేసాడు. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై నానికి చాలా హోప్స్ ఉన్నాయి. తమిళంలో జయం రవి నటించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజైనా కానీ తెలుగులో మాత్రం ఇది బాగా లేటయింది.
ఇది తనకి తప్పక విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో నాని ఇంకా మరే చిత్రానికి కమిట్ కాలేదు. నెలలు గడిచిపోయినా కానీ ఖాళీగానే ఉన్నాడు. ఇప్పుడీ చిత్రం రిలీజ్‌కి రెడీ అవుతుండడంతో నాని సంబరపడుతున్నాడు. ఈ చిత్రం కనుక గురి తప్పితే నాని నెక్స్‌ట్ స్టెప్ ఏమిటో మరి?