మరీ ఎక్కువ చదివేయకండి..

చదవడానికి ఎందుకరా తొందర అన్నట్లుంది మోడీ మహాశయుడి మాటలు. తను ఆర్డినరీ స్టూడెంట్ ను అని, రైటింగ్ సరిగ్గా రాదని పిల్లలకు చెబుతున్నారు. ఇప్పుడు పిల్లలు ఏమనుకోవాలి? మరీ చదువు ఎక్కువ అక్కరలేదు..రైటింగ్ సూపర్…

చదవడానికి ఎందుకరా తొందర అన్నట్లుంది మోడీ మహాశయుడి మాటలు. తను ఆర్డినరీ స్టూడెంట్ ను అని, రైటింగ్ సరిగ్గా రాదని పిల్లలకు చెబుతున్నారు. ఇప్పుడు పిల్లలు ఏమనుకోవాలి? మరీ చదువు ఎక్కువ అక్కరలేదు..రైటింగ్ సూపర్ గా వుండక్కరలేదు. ఏదో ఒక లైన్ ఎంచుకుని పైకి ఎగబాకేయచ్చు అనుకోరా? అసలే మన జనాలు సచిన్ చూసి బ్యాట్ పట్టుకుని పుస్తకాలు వదిలేసే రకం. సినిమా స్టార్ ల వైనాలు చూసి, పరీక్షలు ఎగ్గొట్టే బాపతు. 

అలాంటి వాళ్లకు మరింత భయం చెప్పాలి. కష్టపడమని చెప్పాలి. అబ్దుల్ కలాం మాదిరిగా కలలు సాకారం చేసుకోవడానికి కష్టపడమని చెప్పాలి. అర కొర చదువులకు, ర్యాంక్ లకు సీట్ల ఎక్కడ ఇస్తారు? ఉద్యోగాలు ఎవరు ఇస్తారు. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ లు, సోషల్ నెట్ వర్క్ లు, సినిమాలు అన్నీ కలిసి చదువులు అటకెక్కిస్తున్నాయి. ఇక ఇలాంటి జనాలకు మోడీ మహాశయుడు ఇలాంటి మాటలు చెబితే పరిస్థితి ఇంకా దారుణంగా వుంటుంది.