సచిన్‌ వర్సెస్‌ షరపోవా

ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్‌ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది షరపోవా. ఆమె అంటే ఎవరో తెలియనివారుండరు టెన్నిస్‌ అభిమానుల్లో. సచిన్‌ టెండూల్కర్‌.. పరిచయం అక్కర్లేని వ్యక్తి ఈయన. కేవలం క్రికెట్‌ అభిమానులే కాదు, సచిన్‌ అంటే తెలియనివారు…

ప్రపంచ వ్యాప్తంగా టెన్నిస్‌ క్రీడాభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది షరపోవా. ఆమె అంటే ఎవరో తెలియనివారుండరు టెన్నిస్‌ అభిమానుల్లో. సచిన్‌ టెండూల్కర్‌.. పరిచయం అక్కర్లేని వ్యక్తి ఈయన. కేవలం క్రికెట్‌ అభిమానులే కాదు, సచిన్‌ అంటే తెలియనివారు ప్రపంచంలో ఎక్కడా వుండరు. అంత పాపులర్‌ ఫిగర్‌ సచిన్‌ టెండూల్కర్‌.

కానీ, షరపోవాకి సచిన్‌ టెండూల్కర్‌ ఎవరో తెలియదట. ఈ విషయం షరపోవా స్వయంగా చెప్పింది. నిజంగానే షరపోవాకి సచిన్‌ అంటే ఎవరో తెలియదో, లేదంటే కావాలనే అలా ఆమె చెప్పిందోగానీ, సచిన్‌ అభిమానులకు ఈ విషయం ఆగ్రహాన్ని తెప్పించింది. సచిన్‌ని ప్రపంచమంతా కీర్తిస్తోంటే ఆయనెవరో తెలియదంటావా.? అంటూ షరపోవాపై సచిన్‌ అభిమానులు ఏకంగా యుద్ధం ప్రకటించేశారు సోషల్‌ మీడియా ద్వారా.

సచిన్‌ ముందు నువ్వెంత..? అంటూ సచిన్‌ అభిమానులు షరపోవాని ప్రశ్నిస్తోంటే, ‘షరపోవాపై ఇంత రాద్ధాంతం అనవసరం..’ అని ఆమె అభిమానులూ రిప్లయ్‌ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సైబర్‌ వార్‌ తారాస్థాయికి చేరింది. భవిష్యత్తుల ఈ యుద్ధ పరిణామాలు ఇంకెంత తీవ్రంగా వుంటాయోగానీ, ప్రస్తుతానికైతే సచిన్‌ అభిమానులు మాత్రం ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు షరపోవాపై.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్‌ పుణ్యమా అని షరపోవా టెన్నిస్‌ రంగంలో సాధించిన విజయాలు, సచిన్‌ క్రికెట్‌ రంగంలో సాధించిన విజయాల గురించి ఇప్పటిదాకా తెలియనవారు కూడా తెలుసుకునే అవకాశం దొరుకుతుండడం విశేషం.