మగాడు..తారకరత్న?

శ్రీమంతుడు టైటిల్ బాగానే వుంది అని జనాభిప్రాయమైనా, మహేష్ బాబు తన సినిమాకు మగాడు అన్న టైటిల్ పెట్టే ఉద్దేశంలో వున్నాడని వినికిడి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నిజానికి మగాడు…

శ్రీమంతుడు టైటిల్ బాగానే వుంది అని జనాభిప్రాయమైనా, మహేష్ బాబు తన సినిమాకు మగాడు అన్న టైటిల్ పెట్టే ఉద్దేశంలో వున్నాడని వినికిడి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నిజానికి మగాడు అనే టైటిల్ కన్నా శ్రీమంతుడు అనే టైటిల్ నే కాస్త కొత్తగా వుందని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. 

సరే, ఈ వైనం ఇలావుంటే తారకరత్న హీరోగా కొన్నాళ్ల క్రితం ఓ సినిమా ప్రారంభమై ఆగిపోయింది. దాని పేరు మగాడు. ఇప్పుడు  ఆ సినిమా నిర్మాతలను పట్టుకుని టైటిల్ తీసుకోవాలని ప్రయత్నమట. వాళ్లు ఊ..ఆ ..అంటున్నారని వినికిడి. 

ఇంకేముంది..మామూలే..కళ్యాణ్ రామ్ కత్తి, మాదిరిగా మహేష్ మగాడు అంటే సరి. ఇప్పటికి రెండు మగాడు సినిమాల అయ్యాయి. ఎన్టీఆర్, రాజశేఖర్. ఇప్పుడు ఇది మూడోది అవుతుంది.