నాలుగు పదుల ఐశ్వర్యం.!

ఈమెకు 41 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్మగలరా.? ఛాన్సే లేదు.. ఏ పాతికో ముప్ఫయ్యో.. అనుకోవాల్సిందే. వయసు మీద పడ్తున్నా వన్నె తరగని అందం ఆమె సొంతం. పరిచయం అక్కర్లేని పేరు అది. ఆ…

ఈమెకు 41 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్మగలరా.? ఛాన్సే లేదు.. ఏ పాతికో ముప్ఫయ్యో.. అనుకోవాల్సిందే. వయసు మీద పడ్తున్నా వన్నె తరగని అందం ఆమె సొంతం. పరిచయం అక్కర్లేని పేరు అది. ఆ పేరే ఐశ్వర్యారాయ్‌.

ఓ బిడ్డకు జన్మనిచ్చి సినిమాలకు దూరమైనా, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్‌ ప్లేస్‌ని ఇంకెవరూ ఆక్యుపై చెయ్యలేదంటేనే ఆమెకున్న ఫాలోయింగ్‌, ఆమెకున్న స్టార్‌డమ్‌ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. గత కొన్నేళ్ళుగా ‘కేన్స్‌’లో ఐశ్వర్యారాయ్‌ సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అవుతూ వస్తోంది. ఈసారి కూడా ఐశ్వర్యారాయ్‌ కేన్స్‌లో ఎలా కన్పిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలోనూ వుంది.

అందరి అంచనాల్ని మించేలా ఫ్లోరల్‌ డ్రెస్‌లో ఐశ్వర్యారాయ్‌ చూపరుల మతులు పోగొట్టేసింది. వయసు కారణంగా వచ్చిన చిన్న చిన్న మడతలు తప్ప, అందాల ఐశ్వర్య మోము అప్పటికీ ఇప్పటికీ అలానే వుంది. ఐష్‌ రాకతో కేన్స్‌ గ్లామర్‌ ఒక్కసారిగా పదింతలయ్యిందనడం అతిశయోక్తి కాదేమో.!